Posts

Showing posts from 2012

Chilipi prasnanaa kavitha

   ఎదుటే నిలిచింది ..    అందంగా ముస్తాబైంది ..    ఆహ్లాదంగా తిలకిస్తుంది ..    చిరునవ్వులు చిందిస్తుంది ..    చూసినంతనే హాయినిస్తుంది ..    దరి చేరుటకు ఉర్రూగులూగుతుంది ..    తనకు లేరు సాటి అని విర్రవీగుతుంది ..    ఎంత చూసినా తనివి తీరదంటుంది ..     ఎవరా అనే కదా మీ సందేహం ..?!     ఏమనుకుంటున్నారు ..?     చందమామ అనా !!     కాదు..:-(     చెప్పెయనా ..:-)        అది...    అదేనండి ....       అద్దంలో మీ ప్రేతిబింబం ..:-))

Subhodaya Subhakaamshalu

తెల తెల వారే  .. కిల కిలమని పక్షులు ఎగిరే .. గల గలమని సెలయేళ్ళు జాలువారే .. సూర్య కిరణాలు భువిపై మెరిసే .. నేస్తమా ఇక మేల్కొనుము పువ్వులు విరిసే .. సరికొత్త రోజుకి స్వాగతాలు పలికే .. "శుభోదయ శుభాకాంక్షలు" తెలిపే ..

Talukkumanna taaraka

విను వీధిలో తారకలా మెరిసావే .. నా కనుపాప సందట్లో  తళ్క్కుమంటివే .. నా గుండె చప్పుడుగా మారవే .. నీ తలపులు ఓ నాదమై .. నీ అనుఅనువు ఓ స్వరమై .. నా శ్వాస ధ్యాస నీవై .. నీవు నాకు నీడవై .. నేను నీకు తోడునై .. వుందామా ఒకరికి ఒకరై .. దాగుడుమూతలు చాలించావే ఓ రాలుగాయి .. వన్నె చిన్నెల పావురాయి ..

Chandruni sogasu

పున్నమి చంద్రుని జిలుగులు .. ఆద్యంతం మనోహరము .. పున్నమి చంద్రుని రూపము .. కనులకు నయనానందకరము .. పున్నమి చంద్రుని లావణ్యము .. ఎంతైననూ వర్ణనాతీతము .. అందుకుందామా ఆ జిలుగును .. శ్వాసిద్దామా ఆ రూపమును .. ఆస్వాదిద్దామా ఆ లావణ్యమును .. ఇదేలే ప్రకృతి మాయ .. మదిని దోచి గుండె లయను మీటేను ఈ హోయ ..

Manishi saadhanaa polika

ఎగిరే గాలిపటం .. ఎగసి అందుకొనేను గమ్యం .. పై పైకి ఎగిరి పక్షి .. ఆగకుండు వలస వరకు అలసి .. పొంగి పొరలే నీరు .. అందుకునేను సముద్రపు జోరు .. ఎగిరి ఎగసి పొంగి సాగేను ప్రకృతి .. ఇష్టపడి కష్టపడి సాధించుకునేను మనిషి ..

Padati aabharanamulu

నీ అందం అదిరే మైమరపులు .. నీ పలుకులు తేనె మకరందములు .. నీ నడక నెమలి హొయలు .. నీ కనులు పుష్పించే తామరలు .. ఎంత వర్ణించినా తరగని చందములు .. జగతిన పడతి సొగసులు .. ప్రకృతి మారు రూపులు .. అందమునకు మెరుగులు .. ఈ ప్రేమ .. వాత్సల్యం .. కరుణ.. స్త్రీ అందమును పెంచే ఆభరణములు ..

Subharaatri sandesam

నిదురించుము చల్లని వెన్నెలలో .. ఆ జాబిలి మెరిసే విరితోటలో .. విరిగాలుల మైమరపులో  .. చక్కని పూల సువాసనలో  .. కలల విహారంలో  .. నిదురించి కాష్టాల్ని మరచి సేదతీరుము ఆనంద డోలికలలో  .. ఈ చల్లని రాత్రిలో  .. నీ కనులు వేగిగా సోలెనులే ఈ చిరు సందేశం నీవు చదివే వేళ ..

Sandyaa samaya vaela cheli talapulu

సంధ్యా రాగాలేవో మది పాడుతున్న వేళ .. కోయిల గానము నా మదిని మీటే వేళ .. వసంత మాసపు గాలుల సవ్వడేదో మదిని కవ్వించే వేళ .. గులాబీల పరిమలమేదో మదిని పులకరింప చేసే వేళ .. నీవు నా మదిని దోచావే వెన్నెల కిశోరంలా .. రావే దర్జాగా ఊరేగుతూ నా మది పాల్లకిపై రాజ చంద్రికలా .. నా ఈ హృదయ సామ్బ్రాజ్యంలో  కలకాలం కొలువుండు నా గుండె చప్పుడులా ..

Madi paade udaya raagam

సరిసా||గమపా||నీదని|| మాపదా||రిమారి||సరిగమపదని|| తెలవారే మదిపాడే చల్లగా ఊయలుగెనె .. మంచు కమ్మిన శిఖరాలు స్వాగతించేనే .. చిరు బిందువులతో పచ్చిక బయ్యలు దర్శనమిచ్చేనే .. గూళ్ళల్లో చలికి దాక్కున్న పక్షులు కనువిందు చేసెనే .. భోగి మంటలతో చలి కాచుకుంటున్న జనులు కనిపించెనే .. మేల్కొని ఈ కనువిందును తిలకించుము మది సంతసించెనే ..

Nesthama neekosam

నేస్తమా నేస్తమా వచ్చానే నీకోసం .. జాబిలి నీవైతే వెన్నెలనై చల్లగా మారనా నీకోసం .. పూచే పువ్వు నీవైతే పరిమళమావ్వనా నీకోసం .. దూకే జలపాతం నీవైతే హోరుగా మారనా నీకోసం .. నదివి నీవైతే ప్రవాహాన్ని కానా నీకోసం .. అందాల ప్రకృతి నీవైతే ఆ అందానికి అందమై వస్తాను నీకోసం .. నేస్తమా నా మనసే కోవెలైతే నిన్ను ప్రేమగా పూజిస్తాను కకాలం ..

Udayakaala sandesam

ఉషోదయ కిరణాలు జ్వలించే .. నులివెచ్చగా మోమును స్పృశించే .. జీవితపు మరు రోజు ఉదయించే .. ధనుర్మాసమున ఆ శ్రీహరిని ధ్యానించే .. ప్రపంచ శాంతి కొరకు ప్రార్ధించే .. ఆనంద శిఖరాలకై ఆకాంక్షించే .. ప్రతి ఉదయం నందనమయం కావాలని అభిలాషించే .. మన మంచి ఆలోచనలే వ్యాపించి ప్రపంచం కలుషరహితం కావాలని ఈ చిరు సందేశం వినిపించే ..

prakruthi andam

అందాలలో మహోదయం .. సూర్యుని రాక అరుణోదయం .. చల్లని వీచిక చంద్రోదయం .. నక్షత్ర మాలిక ఓ సోయగం .. మనలను ఆహ్లాదపరిచే నందనం .. అబ్బురపరిచెను ప్రతి దినం .. ఈ ఒరవడి ఓ నవోదయం .. చిత్రంగా సాగే ఈ దినచర్యం .. కడు రమణీయం .. విచిత్రమయం ..

Telugu baasha chaatimpu

తెలుగు వెలుగులు వెలిగించు .. జిలుగులకై ఆకాంక్షిచు .. ప్రపంచానికి చాటించు .. భాష మూలాన్ని ధ్వనించు .. తెలుగువారి భాండమని గర్వించు .. దేశ దేశాలకి ఈ కమ్మదనాన్ని వ్యాపించు .. గౌరవాన్ని పెంపొందించు .. తెలుగు జాతి కీర్తికై  ప్రయత్నించు .. జగతికి ఈ తియ్యదనాన్ని పంచు .. మన పలుకులతోనే చిరస్థాయిగా నిలుచు .. మరువద్దు తెలుగును .. ప్రేమించు ..ఆరాధించు .. ఆశ్వాదించు .. తప్పక మనసుకి స్వాంతననిచ్చు ..

Poetry in telgish

Ee reyina chandruni samakshamlo, nakstraalaa merupula madyana, aaksam ane duppti meda paruchukuni kurchuna aa grhaalu, kaantuleenutunte.. bhuvi nundi diviki vinthagaa chustuu.. alaa nilabadi maimarustunte.. aa kanthi nee momu meda padi neevu chatukuna ee lokam loki vastundagaa.. ninu evaro tatti lepagaa, emanaro telusa.. Roadki addamgaa em chestunav ani adagagaa.. Ivalti poetry lo epudu lendi jarigindi ani ?? ahaa.. telisinda...?! Ayyoo.. Praasa mitramaa.. praasaa Samajiynadaa naa tiyani ghoshaa.. Adanamata naa ee konte nasa..:-))

Different kind of story poetry..

A girl in a palace.. Came out.. Went to buy a necklace.. Walked in.. Borrowed in a suitcase.. Returned back.. Went up through a staircase.. Opened door.. Kept it in her showcase.. Enti chustunaru kadha iypoyndi.. velli necklace chusese randi showcase lodi.. Chudataniki andubaatulo undi.. Ela anukuntunara.. Ayyo telileda?! Last lo door close cheyaledu.. Inkenti waiting?! Nachite "Comment" pettaindi.. That's it..:-))

Happens for most people

Not getting sleep? Then wake-up.. Again Getting sleep.. Then sleep.. Why to wake-up.. Oh already waken-up.. Again you want to sleep.. Then Switch on the lamp.. Open your cupboard.. Then open your college text book wt! still watching! No way! i know u have already slept..:->   GOOD NIGHT..

Funny boring day

Today is a boring day.. A very lazy day.. A very sour day.. A very salty day.. Finally tasteless day..! Thinking why? Today i gave holiday for my poetic flow.. :-)):-)):-)) Hey emyndi! Oh! Feeling Happy :-(( Aahaa no way:-] Entha aasa! atlaantivemi jaantha neyi.. Why will i leave you?! Have to read.. and click "like" Ardamyndi kada.. Then kya sochaa my fnd.. Do it:-D

Different kind of poetry

This is a different kind of poetry.. It tastes like a sweet pastry.. Makes you feel lovely.. Takes yourself to dreamy.. Wishes fulfill simply.. Touches and makes you glittery.. You become as strong as ivory.. Finally it make u feel as your stomach full.. Thinking what is different!! Wt yaar.. If my poetry makes u feel all these then wt will u do later..!! Bore kodatadi kadaa.. so.. Different ga anipinchinda..! :-)):-))

Happenings in life

Happiness comes in life.. Sorrows comes in life.. Tensions come in life.. Many challenges occurs in life.. You overcome and take everything as it comes in life.. Then why not one click not happening in my life.. Thinking what? Hey "Comment" button click yaar..:-) Understood¿ then why late:-[ Do it:->

Funny rhyming

Jil jil jil.. A lovely dol dol dol.. Up above the hill hill hill.. Struck mera dil dil dil.. In a vil vil vil.. Pay the bill bill bill.. Bring down down down.. Gift it to me me me.. Waiting waiting waiting..! I know u will will will.. Ting Ting Ting.........!!

Variety sleeping poetry

R u Sleeping... Really sleeping..:) Just sleeping..:-* funny sleeping..:-] comedy sleeping ..:-> rocky sleeping..:-D compel sleeping..:-( kindly sleeping..:-] jolly sleeping..:-> interested sleeping..:-) uninterested sleeping:( lovable sleeping:-)) Dreamy sleeping;-) Arey yaar.. what ever type may be your sleep.. Just have a pleasant and peaceful sleep.. :-)

Mixture of english and telugu fun like

This is a special poetry.. An extraordinary poetry.. A variety poetry.. A marvelous poetry.. A superb poetry..   ఏంటి చూస్తున్నారు ఇంతకి పోయెట్రీ ఎక్కడా అనేనా..! మరి అదే .. స్పెషల్ అని చెప్పనా .. వెరైటీ అని చెప్పనా .. మరి ఇదే కదా .. ఇంకేంటి చూస్తున్నారు .. నచ్చింది అని చెప్పచ్చు కదా ..!

Evening time

Evening time.. Sunset time.. Its a tea time.. A lovely time.. Pleasant time.. Chit chat time.. Lovely nature time.. By watching can become tension free all the time.. That's the specialty of the cool evening time..

Funny talk between moon and stars

Moon came.. Stars came.. Sitting on the sky.. I came.. You came.. The whole world came.. Sat watching the sky.. You and i chitchatting.. Moon and stars also chatting.. World has been watching.. In between moon asked stars.. How you Shine.. Stars also asked how do you glow.. You know what they had replied..? They turned to us and replied.. We use Fair and lovely and Fair and handsome.. Do you...?!

Funny English poem

Ready Ready get ready.. Hurry hurry why so hurry.. Wait wait my berry.. Praising praising u my cutey Lovely lovely u r my sweaty.. Waiting waiting 4 wt my jelly.. Lot of praising praising makes you lazy.. Still waiting waiting my dolly.. For 2day its enough..! Arey go and sleep jolly .. Tomorrow i will get u praises in a trolly..

Cheli chetilo chikkina chinnodu

ఓ! చెలి ఎటులుంటిని .. నీకోసమే వచ్చితిని .. నీ చేతిలో ఓదిగిపోతిని .. కలకాలం ఇక నీతోనే అంటుంటిని ..! ఓ! బుల్లోడ నా చెలికాడా .. నా చేతిలో చిక్కిన వలపుకాడా .. ఆడిస్తా బొమ్మలా బుడతడా .. చాలించు నీ టెక్కు చిన్నోడా ..! వయ్యారి చినదానా .. సొలపు వలపుల గడుసుదానా .. నీ మనసు దోచుటకు వచ్చానే .. నీ చేతిలో ఒదిగానే .. నీ గుండెలో చేర్చుకోవే ..! నీ కొరకు నీ చేతి బొమ్మనై రానా .. నీ మనసునే దోచుకోనా .. నీకై మిగిలిపోనా .. నా చెలిని చుస్తూ ఇక ఉండిపోనా ..! సొగసరి బుల్లి .. నా సిరిమల్లి .. వన్నెచిన్నెల జాబిల్లి .. చేయకే లొల్లి .. నా మరుమల్లి .. ప్రియ నీ చేతిలో పెడతానే చక్కలిగిలి ..! చిలిపిగా మనసును దోచిన చెలికాడు .. నా కనుపాపలో మెరిశాడు .. నా చేతిలో చిక్కాడు .. ఆడక తప్పదు మరి నీవే నా సరిజోడు ..!

Kaarthika maasa visistatha

కార్తీక మాసాన ఈ నెల వేవేల దీపాలతో ప్రజ్వలించగా .. జగమంతా శివ మయం కాగా .. మనసార ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోగా .. భవహరుడు శశిధరుడు మన కొరకు ఇలకు దిగిరాగా .. ప్రాణకోటి పులకించగా .. శిశుపక్షాదులు ఆ హరుని ఆహ్వానించగా .. జనులెల్ల భక్తితో ప్రణమిల్లగా .. ఆ ముక్కంటి మనసు కరగిపోగా .. ఆడెను ఆనంద తాండవం సృష్టి స్థితి గతి మారిపోగా .. చెడు వినాశనమవ్వగా .. లోకమెల్లా మంచితనమునకు అంకితమాయనుగా ..

Manasu aaraatam

మనసా వద్దు మాటాడద్దు .. అత్యాశల పర్వానికి తెర తీయద్దు .. అందనివి ఆశించద్దు .. అందాల్సిన వాటిని దూరం కానివద్దు .. మనసున ఆశ నిరాశల రాతల పద్దు .. ఈ చిన్న జీవితానికి అవుదాం సద్దు .. ఎల్లప్పుడూ చెడు మార్గం కద్దు .. మంచి మార్గానికి లేదు కంచెల హద్దు ..

Jeevitha thatvam

రాయినైనా బావుండును కష్టాల ఒరిమిని తట్టుకొనవచ్చును .. విహంగ పక్షినైనా బావుండును ఎచతికైనా ఎగిరిపోవచ్చును .. నదీ ప్రవాహాన్నైనా బావుండును సముద్రపు జడిలోనికి జారిపోవచ్చును .. అగ్గినైనా బావుండును ఆ జ్వాలాగ్నిలో చెడును దాహించవచ్చును .. వీచే గాలినైనా బావుండును అలజడితో నష్టాలను చెదరగొట్టవచ్చును .. కాని .. మనసున్న మనిషినైతిని ఎటు పోనీక అడ్డుపడుచు ప్రేమతో కట్టిపడేస్తుండును ..

Krishnayya haela

యమునా తటిలో  .. ఆ అలల జడిలో  .. యశోదమ్మ వడిలో  .. క్రిష్ణయ్య లీలగా .. అచట కరుణించగా .. నందనవనముగా మారెనుగా .. కనుల పండుగగా విచ్చేయంగా .. జనుల కలలు నేరవేరంగా .. సంతోష సంబరాలు మిన్నంటేనుగా ..

Dharani goppathanam

నిన్ను నన్ను ఏకం చేసే ఈ నేల .. నింగిలోని వర్షపు చినుకును అందుకునే ఈ నేల .. సూర్య చంద్ర కాంతులను తనలో ఇముడ్చుకొనే ఈ నేల .. ఎన్నో ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునే ఈ నేల .. అత్యంత శక్తివంతమైనది .. ఎంతో దిటువుగలది .. అటులనే జీవిత ఆటుపోటులను తట్టుకోవాలని చెప్పకనే చెబుతున్నది .. నీకు ఇవే మా జోహార్లు .. తప్పక కాపాడుదురు ఎల్లప్పుడూ నిన్ను ఈ భూసురులు ..

koila kammani paluku

కోకిలమ్మ బడాయి .. చాల్లె నీ లడాయి .. మాకు తెలుసులే నీ ఉత్సాహమోయి .. చలి చలిగా ఈ వేళ నీ ఆలపనకేనోయి .. నీ కుహుకుహులు వినిపించోయి .. మా మనసుకు ఇక నందనమోయి .. నీ రాగాల మాయలో జనులు పులకించేనోయి ..

Jeevinche vidhaanam

విధాత తలపు నుండి ఈ సృష్టి జనించినది .. ప్రాణకోటి ఆవిర్భించినది .. జీవరాసులన్నిట తెలివిగల ప్రాణిగా స్థానం మానవ కోటికి దక్కినది .. విశ్వాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించినది .. ప్రపంచ విలువలను పెంచినది .. ప్రేమానుబంధాలతో జీవనం సాగించటం నేర్పించినది .. అటువంటి ఈ జీవితమును నీవు నిస్వార్ధముగా గడిపినప్పుడే సార్ధకత చేకూరుతుంది .. చిరస్థాయిగా అందరి మదిన నీ రూపము మంచికి మారుపేరుగా నిలిచి ఉంటుంది ..

Deepaavali Subhaakanshalu

నింగిలోని రంగుల హరివిల్లు .. భువిలోన దీపావళి రంగుల కాంతులు .. అందరి ఇంట సంబరాల హుషార్లు .. వెలుగుల జిలుగుల మద్యన మిన్నంటిన స్వరాలు .. ఈ దీపావళి వెలుగులు ప్రతి ఇంట నింపాలి ఆనంద దివ్వెలు .. అని .. ఆశిస్తూ .. తెలిపేను .. అందరికి .. "దీపావళి శుభాకాంక్షలు .."

Manasu maatalu

మనసా వద్దు మాటాడద్దు .. అత్యాశల పర్వానికి తెర తీయద్దు .. అందనివి ఆశించద్దు .. అందాల్సిన వాటిని దూరం కానివద్దు .. మనసున ఆశ నిరాశల రాతల పద్దు .. ఈ చిన్న జీవితానికి అవుదాం సద్దు .. ఎల్లప్పుడూ చెడు మార్గం కద్దు .. మంచి మార్గానికి లేదు కంచెల హద్దు ..

Chelini needalaa anusarinchina cheluni hrudaya spandanalu

ప్రియ! నీ తోడుగా రానా .. నీ నీడనై ఉండనా .. నీ బాటనే అనుసరించనా .. నీ గుండె చప్పుడుగా మారిపోనా ..! నా చెలి చెలికాడను నేను .. తన తోడు నీడను నేను .. ఆమె హృదయ స్పందన నేను .. నా జీవిత ఆశా జ్యోతి తను ..! సఖి చూపులకై ఈ నిరీక్షణ .. తన నీడనై సాగిస్తున్నా అన్వేషణ .. మన్నించి నా వంక చూడవా .. నా ప్రాణ సఖివై దరి చేరవా ..! ఓ ప్రియ! ఎటు సాగేను నీ ప్రయాణం .. ఏటైననూ నీ వైపే నా జీవన యానం .. నీ నీడనై సాగుతా కలకాలం .. నా తోడుగా నిలువుము ఎల్లకాలం ..! చిలిపి నవ్వుల చిన్నారి .. వలపు చిన్నెల పొన్నారి .. సోగాసులోలికే వయ్యారి .. నీ నీడనై వస్తున్నానే సుకుమారి ..!

Cheli palukulu priyuni hrudayamunu taake vela

ఆహా! నా చెలి ఏమి నీ పలుకులు .. నీ మృదు మధుర సుభాషితములు .. ప్రేమమైయమై నా గుండెలోకి చేరుతున్నవే .. నా మనసును వీణ తీగ వలే మీటుతున్నవే .. తేనెలురే నీ పలుకులు .. వసంతమున కోయిల గానము వలే సాగుతున్నవే .. అలల వంటి నీ మాటల ప్రవాహములు .. నా మనసులోనికి ప్రేమ తరంగములవలె దూసుకుపోతున్నవే .. చూచితివా నా చెలి పలుకులు .. ఎంత ప్రేమగా నన్ను పిలుచుచుంటివో .. గమనించితివా ఆ హావభావములు .. నా హృదయంత రంగమున చేరుటకు ఎటుల ప్రయత్నించుచున్నదో  .. చెలి మాటలు చిలక పలుకులు .. నా హృదయ స్పందనకు ‌‌వేశేను బాటలు .. నా గుండెను చీల్చి చేరుతున్నవి ఆ ఊసులు .. నాలో రేపుతున్నవి కొంటె వలపుల తలపులు .. నా చెలి మాటలు జలపాతముల గలగలలు .. మీటెనే నా హృదయమున సరిగమలు .. చిగురించేను నా మనసున ప్రేమ సంగతులు .. ఆనందమయమై నా మోమున పూచెను చిరునవ్వులు .. ఏమి నా సఖి హొయలు .. మరులుగోలిపే ఆ మాటలు .. ఆ పలుకులు వలపుల తూటాలు .. నా మనసున దూరి పెట్టెను గిలిగింతలు .. ఓ! చెలి ఏమి నీ మాటల గలగలలు .. ఆ ప్రవాహమునకు ఇక లేదా అడ్డుకట్ట .. నా గుండె అయినదే చీలికలు .. వేయనా నా ప్రేమతో  ఆనకట్ట ..

Cheli chuupulu baanamai cheluni hrudayamunaku guchukunnappudu kalige spandanalu ..

నీ చుర చుర చూపులు .. ఆ చూపులు మాటున వలపులు .. బాణమై నన్ను గుచ్చేనే .. నా గుండెలోని ప్రేమను మీటెనే ..--sent గుండె గొంతుకలో  ..!! ఏమి ఆ కనులు .. అగ్నిగోళము వలే ఆ చూపులు .. నన్ను తాకుతుంటి ఆ వలపుల సూదులు .. నా గుండెను చీల్చి నీకు దాసోహమాయనే ప్రేమ తలపులు .. చిలిపి కన్నుల సొగసరి .. బూరే బుగ్గల గడసరి .. పూల బాణంతో నా మదిని దోచావే వలపరి .. ఇక చిక్కుకుంటినే నీ తలపులలో లాహిరి .. మిల మిల కన్నులు .. చుర చురమనే చూపులు .. దూసుకు వచ్చేనే వలపుల బాణమై .. నిన్ను చేరితినే నీ చెలికాడినై .. ఈ సింగారిని మెచ్చితినే  .. ఈ వయ్యరిని వలచితినే .. తన కనులు చిలిపి బాణాలై నా గుండెను చీల్చితినే .. ప్రేమ దాసుడనై నీ ముందు వాలితినే ..

Cheludini haaramugaa dharinchina sogasariki naa kavithaa spandanalu

నీవు నా కనుపాపవే .. నీవు నా చిరునవ్వువే .. నీవు నా అందాల చేలికాడివే .. నీవు నా ‌కంఠహారమై నిలిచి నన్ను కావవే .. ప్రియ, ఓ ప్రియా .. నీవే కదా నా గుండె లయ .. చేశావే ఎదో మాయ .. నిన్ను నా కంఠహారముగా ధరించి నీదానిగా మారిపోయా .. చెవులకు జూకాలు అందం.. పెదవులకు చిరునవ్వు అందం .. చేతులకు సింగారాల గాజులు అందం .. నీవే నా కంఠమందు హారమై నిలుచుట నాకు ఆనందం .. చెలి ఎచటికి వెడలిదవు .. నన్నెప్పుడు చేరెదవు .. నీకోసమే కదా ఈ వలపుల దీవు .. రారాదా నా దరికి నా మని హారమై నీవు .. తీయ్యని పలుకుల గొంతుకకు .. సన్నని నెమలి సొగసుగల కంఠమునకు .. నేను కానా నీ కంఠహారము .. అందాల సిరిగల మనిహారము .. తలపుల తలుపులు తెరిచావే .. ఎన్నో మలుపులు తిప్పావే .. నా మనసు నీవైపుగా వచ్చెనే .. నా తనువు నీ కంఠహారమై నిలిచేనే .. సోల కళ్ళ సొగసరి .. చిలిపి నవ్వుల గడసరి .. నాపై నీకెంత ప్రేమ నా లాహిరి .. నన్నే మాలగా ధరించితివే వయ్యారి .. పలు రకముల హారములు తిలకించితినే  .. ముత్యాలు పొదుగులు కాంచితినే .. రత్నాల సొబగులు వీక్షించితినే .. చేలుడే హారమగుట చూచి మైమరచితినే .. నిన్ను చూచినా కానరాక .. ఈ విరహమును...

Chiru aasaa kavitha

ఈ చిరు దివ్వెను నే వెలిగించితిని .. నీవు నా మోమున కాంతులు చిందించితివి .. నా ప్రతిరూపమును నీ జ్వాలలో చూపించితివి .. కలకాలం ఈ వెలుగును నేనై అందరిని ఆనందింపవలనని ఆశించితిని ..

Prema Nirikshana

గుండెల్లోని ప్రేమ .. మనసును మీటేను ఆ ధీమా .. చెప్పేయనా ఇకనైనా .. నాపై కరుణ చూపి నా వంక చూడుము కాస్తైనా ..‌ నా ఆశల పలుకువి నీవే .. నా ఊహల జగతివి నీవే .. నీకన్నలేరే మిన్న .. నీ కోసమే నేనున్నా .. ఇకనైనా నా దరి చేరెదవని వేచి వున్నా .. ఈ నిరీక్షణ నీ కొరకే.. ఈ పలుకులు నీ కోసమే .. ఈ చూపులు నీకై వేచి ఉన్నవే .. ప్రియతమా ఇకనైననా నన్ను కావవే ..

Cheli palukula ravali

నా ప్రతి పలుకున నీవే .. నా ఆలోచనా సరళవి నీవే .. నా హృదయమంతా నిండి ఉంటివే .. నా దరి ఎప్పుడు చేరితివే ..! నా ఊహలలో చెలికాడు .. నా మనసును దోచాడు .. ఎవ్వరికీ సరిరాడు .. సాటి లేని మేటి గల ధీటుగాడు .. అందగాడు .. నా ఈ సోగ్గాడు .. ఏమి నీ దర్పము .. నా దగ్గరా నీ గాంభీర్యము .. నన్ను వరించుటకు నీ ప్రయత్నము .. బాగు బాగు నీ నటనా చాతుర్యము ..

Mana ane vaalla prema

ప్రేమ ఒక అమూల్యమైనది .. మనసున  భావాలను స్ప్రుసించేది .. జీవితాన నేనున్నా  అనే  నమ్మకం  కలిగించేది .. అనుదినం  తోడుగా  నిలిచేది .. కష్టాలలో ఆనందాన్ని పంచేది .. మన అనే వాళ్ళ కలుష రహితమైన ప్రేమకు ఇది ఒక నిర్వచనమైనది ..

Dasara subhakaanshala kavitha

ఈ  పండుగను జరుపుకుందాం  ఒక  వేడుకగా .. అన్యాయాన్ని సంహరించగా .. న్యాయం  వేలుగొందుగా .. ఇదే  స్పూర్తిగా  ఎల్లప్పుదూ మనలోని  చెడును నివారించుము .. మంచిని  పెంపోమదించుము .. జగత్ జననిని  శ్రద్దగా ద్యానించుము .. సకల సుభాలకు  అది కారణమగును .. ఇక  మనకి ఈ దసరా నిత్యమూ ఆనందకరమగును దసరా శుభాకాంక్షలతో ఆనందింపుము సకల జనులను ..

Prakruthi maaya

రాగాల తరంగాలలో .. జగమే ఊయల ఊగెనులే  .. వెన్నెల కెరటాలలో .. మనసే ఆనంద తాండవం ఆడేనులే .. జలపాతాల హోరులో ప్రాణకోటి ఆడి పాడేనులే .. ఈ ప్రకృతి చేసే  మాయలో .. మనమంతా మైమరచేనులే .. లేదులే .. దీనికి  సాటి .. రాబోదులే .. దీనికి  మేటి ..

Mee ishtaanni telipe kavitha

చూడు నా ఇంద్రజాలము .. ఈ కవితతో మీకు వేస్తాను గాలము .. మీ స్నేహమే నా లోకము .. మీరెంతో అమూల్యము .. మరవద్దు నన్ను స్నేహితము .. అయితిరా నా మాటలతో ప్రభావితము .. నచ్చితే తెలుపండి మీ ఇష్టము ..

Aananda kavitha

ఆగిపోవాలి కాలము .. మన సొంతమై ఎల్లకాలము .. ఆనంద క్షణాలతో నిండాలి మన లోకము .. కాలానికి దీటుగా ఈ జీవితము .. గెలవాలి మనం అనునిత్యము ..

Preyasiki maatala kavitha

ఒక మాట తెలుపవలనని  ఆశ.. ఎటులనా అని ఆలోచన చేశా.. చిన్న పిల్లాడివలె నీపైకి ఎక్కేశా.. నీ జూకాలతో ఆడుతూ చెప్పాలనుకున్నది చెప్పేశా !

Subhodaya Kavitha

గోరు వెచ్చని సూరీడు .. నిచ్చెన వేసినట్టు పైపైకి వచ్చేడు .. మనకి వెలుగును అందించేడు .. వద్దన్నా వినడు .. కాదన్న వూరుకోడు .. కాసేపు ఆగమన్నా వినని మొండోడు .. మబ్బులు చెప్తే కాని అర్డం చేసుకోడు .. పట్టుదల అంటే అదేనంటూ చాటేడు .. ఇది మనకు జీవిత పాటవమంటూ నేర్పేడు .. ఉషోదయ శుభాకాంక్షలు అంటూ మేల్కొల్పేడు ..

Mana samskrutulu

పదహారు కళలు .. మేటి కళలు .. సంగీత నృత్యాలు .. సాహితి సంస్కృతులు ..  మన దేశపు పాటవాలు ..  వెలికి తీసిన మన హృదయ స్పందనలు .. అలలై పొంగేను ఈ కళలు .. జీవితపు సారాలు .. జగతికి ప్రాణాలు .. నిత్యమై నిఖిలమై వెలగాలి ఈ కళల వెలుగులు ..

Prakruthi naatya leela

మెరిసె మెరుపులు .. మురిసె పెదవులు .. చినుకుల చిందులు .. కదలాడే పాదాలు .. మేఘాల సొగసులు .. చేతి ముద్రలు .. హరివిల్లు వొంపులు .. వయ్యారి నాట్య బంగిమలు .. ఇది ప్రకృతి లీలలు .. నాట్యముతో కలిపి చేసే హేలలు ..

Vayyari siga kavitha

ఓర చూపుల వయ్యారి.. సిగపువ్వు దాల్చిన సింగారి.. నీ కొరకు నీ సిగలో వాడిపోని పూవు వాలే ఉండిపోనా..  లేక తేనెటీగనయి ఈ పూల మకరందాన్ని నీకు అందించనా..!

Chiru vaana

చిరు చినుకులు.. బుల్లి పడవలు.. కన్నె పులకరింతలు.. సెలయేటి పరవళ్ళు.. ప్రకృతి పారవస్యాలు.. తెలుప తరమా మాటలు.. ఈ చిలిపి వాన చేసే సందడులు..

Vanitha Andam

నీ అందం గులాబీల మకరందం .. నీ కురులు అలలా సాగే నదీ ప్రవాహం .. నీ కొరకు వస్తున్నా అలల పొంగుని దాటుకొని .. నీ దరి చేరుతున్నా నీ మదిని నా మదిలోన నింపుకొని..

Aananda Aaswaada Nandanam

ప్రాప్తమనుకో ఈ  క్ష ణమే.. దక్కెననుకో ఈ  నిమిషమే.. గడిపేయి ఆనందంగా.. చిందువేసేయి ఉల్లాసంగా.. మరిచిపో గతాన్ని.. వదిలివేసేయి వర్తమానాన్ని.. ఈ క్ష ణమే ఆస్వాదించు.. ముందరి కాలం  మనదే అంటూ.. జీవితాన్ని నవ్వుతూ సాగించు..

Relationship

Funny funny happenings.. Cute cute things.. Silly silly fights.. Combine in our relations.. Just cutoff egos.. Maintain promises.. For long relationships.. As Life need to have a lovable journey.. & We need to live in that wonderful memory..

My message

My message may not be elegant.. Its just to say you that for me you are important.. It does not need any rewards.. Just all of your sweet smiles.. When you hear my name.. At any time..

Life

Life is like listening to the music.. While listening, rhythm has ups and downs.. Even in life we have happiness and sorrow.. But as the music continues to go on.. Life also should go on.. We switch on to different kind of music to make our self happier.. So as switch always on to good mood to make future life happier..

sakhi

సఖి  ఓ! నా  ప్రియ  సఖి .. ఈ  చెలుని  గుండె  లయ  నీవే  కదా ఓ! చకుముఖి.. నీటిలోని ఈ  తామర పువ్వు నీ  కనులకు నే అందిస్తున్న కానుక ఓ! నా ప్రాణ సఖి.. ఇకనైనా నీ  కొంటె చూపులతో  నన్ను కావవే నా ఇష్ట  సఖి..

Cheli soyagam

నీ అందం గులాబీల మకరందం.. నీ శిరులు అలలా సాగే నదీ ప్రవాహం.. నీ కొరకు వస్తున్నా అలల పొంగుని దాటుకొని.. నీ దరి చేరుతున్నా నీ మదిని నా మదిలోన నింపుకొని..

cheli koraku kavitha

చెలి నీవు అడిగితివని ఈత రాకున్నను ఈ నీటి లోనికి  అడుగిడితిని .. ఈ తామర  పువ్వును నీ కొరకు అందించేందుకు సాహసించితిని.. తామర తూళ్ళు వంటి నా ఈ  మనసును కలువ రేకుల వంటి  నీ కనులకు అందించుటకై పరితపించింతిని.. ఇక నా ఇష్టమును ఎరిగి నన్ను కరునించమని కోరితిని..

Prema kavitha

నీ అందం గులాబీల మకరందం.. నీ శిరులు అలలా సాగే నదీ ప్రవాహం.. నీ కొరకు వస్తున్నా అలల పొంగుని దాటుకొని.. నీ దరి చేరుతున్నా నీ మదిని నా మదిలోన నింపుకొని..

Rose

Rose is an attractive flower.. Among all it has a highest honor.. Smell makes us super fresher.. It is a energy gainer.. Just at a glance feel makes us stronger.. Finally its a whole world's heart conqueror..

prema kavitha

చెలి ఓ! నా నిచ్చెలి.. నీ కనులు తామర పూరెకులు నా జిలిబిలి.. నీకు తెలుపుటకు ఈ తామర  పువ్వును అందించుచుంటిని నా జాబిలి .. జాబిలి ప్రకాశం వలే నీ  చూపుతో నన్ను ప్రసన్నుడిని చేయవే నా అందాల విరిమల్లి..

Naughty poem

My cute cute jaabili sweet sweet jilebi.. You are so so bubli.. Turning round and round like a googli.. Once turn to us and see us our naughty mogli.. My friends are waiting for you to see you and sleep like kumbi.. So you are always welcome to my home my jaangri..

Udayapu kavithaa sumam

తెల తెల వార వచ్చే.. మన కనులు తామర తూళ్ళు వలే విచ్చె.. మన హృదయం ఆనందమయమై స్పందించె.. మన మేని మరింత ప్రకాశమయమై కాంతి నిచ్చె.. ఆ తూరుపు అందాలు మనకై ఇటుగా వచ్చే.. ఆ ప్రసరనతో మన జీవమునకు సరికొత్త  శక్తీ వచ్చే..

Prakruthi hoyalu

తొలి సంధ్య కిరణాలు.. తెలి మంచు రాగాలు.. చిరు గాలి తాళాలు.. శెలయేటి నాట్యాలు.. ఈ అవని అందాలు.. చేసేను మన కనులకు విందులు..  జగతికి పసందులు..

Dhyaanapu shakthi

నింగి నేల గాలి నిప్పు నీరు.. అనంతంలా అవి సాగే తీరు.. అనూహ్యము అనన్యము నిత్య నూతనాలు..  మన జీవనానికి వాయులీనాలు.. ధ్యానించుము నిరంతరము.. మనలోని శక్తిని మేలుకోలుపెను..  నిత్య నూతన యవ్వనాన్ని ప్రసాదించేను .. మనసులోని కల్మషాన్ని తొలగించేను.. ఆనందమయమైన జీవితానికి సారధిగా నిలిచేను..

Manasu

కలల అలను చెదరనీకు .. కనుపాపను తడవనీకు .. చిరునవ్వును చెరగనీకు .. మనసును కలవరపడనీకు .. ఆనందాన్ని దూరము కానీయకు .. నీ హృదయ సవ్వడిని ఆలకించుము .. మనసు చెప్పే మాటను వినుము .. నీకు నీవుగా జీవించుము .. ఉన్నత శిఖరాలను అధిరోగించుము ..

Hrudayam

హృదయమా నా ప్రాణమా .. కొంటె ఊసులెన్నొ చెప్పేవుమా .. కలల కోరికలను పెంచేవుమా .. కష్టాలలో గుండెను దిటువు చేసేవుమా .. సుఖాలలో అందరికీ ఆనందాన్ని పంచేవుమా .. నీకు నీవే సాటిలేమ్మా .. నీవెంత కటినమో అంత సున్నితమమ్మా .. అందరి మంచిని కోరేవుమా .. హృదయమా అందరిలో మంచిని పెంచి .. చెడుని తొలగించి .. ప్రేమను పుష్పించి .. ద్వేషాన్ని తుంచి .. ఎలప్పుడు మంచిని గావించి .. నిలువుము అందరి ఆత్మీయ   బంధువుగా .. కలకాలం జనమందరి గుండెల్లో   చిరంజీవిగా ..                                                                 

Prakruthi

కాలాలు మారినా జాబిలి అందం వన్నె తరగనిది.. యుగాలు మారినా నీలి ఆకాశం మెరుపు తరగనిది.. ఎన్ని మెరుపుల కాంతులు ఇలలో వెలిగినా..  ఆ నక్షత్రపు కాంతుల జిలుగుల ముందు తుగేనా..  ప్రకృతి అందానికి లేదు సాటి ఈ జగాన..  మన ఈ ప్రకృతి హోయలను కాపాడుము.. హానికరమైన సామాగ్రిని నివారించుము.. కాలుష్యరహితమైన జీవనాన్ని గడుపుము..

Sweet poem on friends

Cute cute friends.. Bubbly bubbly friends.. Who will be Always with us.. Around us.. In problems.. In Happiness.. Always.. Those friends.. Lovable friends.. Our Sweet friends.. Let all of us be Honey friends.. As Forever friends.. Do You all "LIKE" this my Tweety Friends!