Posts

Showing posts from November, 2012

Cheludini haaramugaa dharinchina sogasariki naa kavithaa spandanalu

నీవు నా కనుపాపవే .. నీవు నా చిరునవ్వువే .. నీవు నా అందాల చేలికాడివే .. నీవు నా ‌కంఠహారమై నిలిచి నన్ను కావవే .. ప్రియ, ఓ ప్రియా .. నీవే కదా నా గుండె లయ .. చేశావే ఎదో మాయ .. నిన్ను నా కంఠహారముగా ధరించి నీదానిగా మారిపోయా .. చెవులకు జూకాలు అందం.. పెదవులకు చిరునవ్వు అందం .. చేతులకు సింగారాల గాజులు అందం .. నీవే నా కంఠమందు హారమై నిలుచుట నాకు ఆనందం .. చెలి ఎచటికి వెడలిదవు .. నన్నెప్పుడు చేరెదవు .. నీకోసమే కదా ఈ వలపుల దీవు .. రారాదా నా దరికి నా మని హారమై నీవు .. తీయ్యని పలుకుల గొంతుకకు .. సన్నని నెమలి సొగసుగల కంఠమునకు .. నేను కానా నీ కంఠహారము .. అందాల సిరిగల మనిహారము .. తలపుల తలుపులు తెరిచావే .. ఎన్నో మలుపులు తిప్పావే .. నా మనసు నీవైపుగా వచ్చెనే .. నా తనువు నీ కంఠహారమై నిలిచేనే .. సోల కళ్ళ సొగసరి .. చిలిపి నవ్వుల గడసరి .. నాపై నీకెంత ప్రేమ నా లాహిరి .. నన్నే మాలగా ధరించితివే వయ్యారి .. పలు రకముల హారములు తిలకించితినే  .. ముత్యాలు పొదుగులు కాంచితినే .. రత్నాల సొబగులు వీక్షించితినే .. చేలుడే హారమగుట చూచి మైమరచితినే .. నిన్ను చూచినా కానరాక .. ఈ విరహమును...

Chiru aasaa kavitha

ఈ చిరు దివ్వెను నే వెలిగించితిని .. నీవు నా మోమున కాంతులు చిందించితివి .. నా ప్రతిరూపమును నీ జ్వాలలో చూపించితివి .. కలకాలం ఈ వెలుగును నేనై అందరిని ఆనందింపవలనని ఆశించితిని ..

Prema Nirikshana

గుండెల్లోని ప్రేమ .. మనసును మీటేను ఆ ధీమా .. చెప్పేయనా ఇకనైనా .. నాపై కరుణ చూపి నా వంక చూడుము కాస్తైనా ..‌ నా ఆశల పలుకువి నీవే .. నా ఊహల జగతివి నీవే .. నీకన్నలేరే మిన్న .. నీ కోసమే నేనున్నా .. ఇకనైనా నా దరి చేరెదవని వేచి వున్నా .. ఈ నిరీక్షణ నీ కొరకే.. ఈ పలుకులు నీ కోసమే .. ఈ చూపులు నీకై వేచి ఉన్నవే .. ప్రియతమా ఇకనైననా నన్ను కావవే ..

Cheli palukula ravali

నా ప్రతి పలుకున నీవే .. నా ఆలోచనా సరళవి నీవే .. నా హృదయమంతా నిండి ఉంటివే .. నా దరి ఎప్పుడు చేరితివే ..! నా ఊహలలో చెలికాడు .. నా మనసును దోచాడు .. ఎవ్వరికీ సరిరాడు .. సాటి లేని మేటి గల ధీటుగాడు .. అందగాడు .. నా ఈ సోగ్గాడు .. ఏమి నీ దర్పము .. నా దగ్గరా నీ గాంభీర్యము .. నన్ను వరించుటకు నీ ప్రయత్నము .. బాగు బాగు నీ నటనా చాతుర్యము ..

Mana ane vaalla prema

ప్రేమ ఒక అమూల్యమైనది .. మనసున  భావాలను స్ప్రుసించేది .. జీవితాన నేనున్నా  అనే  నమ్మకం  కలిగించేది .. అనుదినం  తోడుగా  నిలిచేది .. కష్టాలలో ఆనందాన్ని పంచేది .. మన అనే వాళ్ళ కలుష రహితమైన ప్రేమకు ఇది ఒక నిర్వచనమైనది ..

Dasara subhakaanshala kavitha

ఈ  పండుగను జరుపుకుందాం  ఒక  వేడుకగా .. అన్యాయాన్ని సంహరించగా .. న్యాయం  వేలుగొందుగా .. ఇదే  స్పూర్తిగా  ఎల్లప్పుదూ మనలోని  చెడును నివారించుము .. మంచిని  పెంపోమదించుము .. జగత్ జననిని  శ్రద్దగా ద్యానించుము .. సకల సుభాలకు  అది కారణమగును .. ఇక  మనకి ఈ దసరా నిత్యమూ ఆనందకరమగును దసరా శుభాకాంక్షలతో ఆనందింపుము సకల జనులను ..

Prakruthi maaya

రాగాల తరంగాలలో .. జగమే ఊయల ఊగెనులే  .. వెన్నెల కెరటాలలో .. మనసే ఆనంద తాండవం ఆడేనులే .. జలపాతాల హోరులో ప్రాణకోటి ఆడి పాడేనులే .. ఈ ప్రకృతి చేసే  మాయలో .. మనమంతా మైమరచేనులే .. లేదులే .. దీనికి  సాటి .. రాబోదులే .. దీనికి  మేటి ..

Mee ishtaanni telipe kavitha

చూడు నా ఇంద్రజాలము .. ఈ కవితతో మీకు వేస్తాను గాలము .. మీ స్నేహమే నా లోకము .. మీరెంతో అమూల్యము .. మరవద్దు నన్ను స్నేహితము .. అయితిరా నా మాటలతో ప్రభావితము .. నచ్చితే తెలుపండి మీ ఇష్టము ..

Aananda kavitha

ఆగిపోవాలి కాలము .. మన సొంతమై ఎల్లకాలము .. ఆనంద క్షణాలతో నిండాలి మన లోకము .. కాలానికి దీటుగా ఈ జీవితము .. గెలవాలి మనం అనునిత్యము ..

Preyasiki maatala kavitha

ఒక మాట తెలుపవలనని  ఆశ.. ఎటులనా అని ఆలోచన చేశా.. చిన్న పిల్లాడివలె నీపైకి ఎక్కేశా.. నీ జూకాలతో ఆడుతూ చెప్పాలనుకున్నది చెప్పేశా !

Subhodaya Kavitha

గోరు వెచ్చని సూరీడు .. నిచ్చెన వేసినట్టు పైపైకి వచ్చేడు .. మనకి వెలుగును అందించేడు .. వద్దన్నా వినడు .. కాదన్న వూరుకోడు .. కాసేపు ఆగమన్నా వినని మొండోడు .. మబ్బులు చెప్తే కాని అర్డం చేసుకోడు .. పట్టుదల అంటే అదేనంటూ చాటేడు .. ఇది మనకు జీవిత పాటవమంటూ నేర్పేడు .. ఉషోదయ శుభాకాంక్షలు అంటూ మేల్కొల్పేడు ..

Mana samskrutulu

పదహారు కళలు .. మేటి కళలు .. సంగీత నృత్యాలు .. సాహితి సంస్కృతులు ..  మన దేశపు పాటవాలు ..  వెలికి తీసిన మన హృదయ స్పందనలు .. అలలై పొంగేను ఈ కళలు .. జీవితపు సారాలు .. జగతికి ప్రాణాలు .. నిత్యమై నిఖిలమై వెలగాలి ఈ కళల వెలుగులు ..

Prakruthi naatya leela

మెరిసె మెరుపులు .. మురిసె పెదవులు .. చినుకుల చిందులు .. కదలాడే పాదాలు .. మేఘాల సొగసులు .. చేతి ముద్రలు .. హరివిల్లు వొంపులు .. వయ్యారి నాట్య బంగిమలు .. ఇది ప్రకృతి లీలలు .. నాట్యముతో కలిపి చేసే హేలలు ..

Vayyari siga kavitha

ఓర చూపుల వయ్యారి.. సిగపువ్వు దాల్చిన సింగారి.. నీ కొరకు నీ సిగలో వాడిపోని పూవు వాలే ఉండిపోనా..  లేక తేనెటీగనయి ఈ పూల మకరందాన్ని నీకు అందించనా..!