Chelikaadu cheli taage taeneeruna aaviraina vaela

నా శ్వాశ నీవే ..
నా ద్యాస నీవే ..
తాగే తేనీరులో నీరు నీవే ..
నా గొంతుకలో శ్రుతి నీవే ..!!

అందాల చెలికాడు నా ముందు ..
పంచెను నా కనులకు విందు ..
ప్రత్యక్షమయ్యే అన్నిటా ..
నా మనసు వాకిటా ..!!

సెగలా ఎగసావు ..
నా గుండెలో ఒదిగావు ..
నీరులా పారావు ..
నా కంటి పాపలో దాగావు ..!!

కప్పు తేనీరు ..
మనసును ఉత్తెజపరుచును ..
అందున నీ ప్రేమ ..
మన బంధాన్ని గట్టిపరుచును ..

చెలి మోము చూచుటకు ..
వచ్చితిని ఇటుల వేడి సేగానై ..
తన ప్రేమ పొందుటకు ..
దక్కనంతనే నే వెళ్ళిపోతా ఆవిరినయి

ఈ ఆవిరి ..
నా ప్రేమ లాహిరి ..
నా కలలకు ఊపిరి ..
మనసున పెట్టు గిలిగిలి ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu