Cheli venuka saamaagritho cheluni avastha

ప్రియ! నా ప్రేమ బరువు నీదనుకున్న ..
నా జీవిత భాగం నీదనుకున్న ..
నా సర్వస్వం నీవే అనుకున్న ..
ఆఖరకు నీ వెనుక నీ చేతి బరువును మోస్తున్న ..!

చెలి! ఏమి నాపై ఈ భారము ..
ఇటుల చేయుట కాదా నేరము ..
నన్ను విముక్తుడను చేయవా ఇకనైనా ..
నీ ప్రేమతో కరుణించవా కాస్తైనా ..!

చెలి! నీ ప్రేమ కొరకు వస్తున్నా ..
నీకోసమే ఈ సామగ్రిని తెస్తున్నా ..                   
నా ప్రేమనంతా నింపుకొని ..
నీ ప్రేమ కొరకు నిరిక్షిస్తున్నా ..!

సఖి! ఎంతగా నీ వెంట తిరుగుచుంటిని ..
నీ ప్రేమ కొరకు ఎంతగా ప్రాకులాడుచుంటిని  ..
ప్రతిరోజు నీ వెంట నీడలా అనుసరించుచుంటిని ..
కరుణ చూపి నిచ్చెలిగా ఎప్పుడు మారుచుంటివి ..!

ఓ! హంస నడకల వయ్యారి ..
మన ప్రేమ భారం నాదనుకున్నానే ..
ఎంత పని చేస్తివే గడసరి ..
నీ వెనక కూలీని చేసి తిప్పుతుంటివే సింగారి ..!

వస్తున్న వస్తున్న నీకోసమే వస్తున్నా ..
నీకోసం బహుమతులు కొని తెస్తున్నా ..
వీటిలో నా మనసులోని ప్రేమను నింపి మోసుకొస్తున్నా ..
నీ మనసులో  ఇకనైనా చోటిస్తావని ఆశిస్తున్నా ..!

ప్రియ షికారు అన్నావు ..
ఊరంతా తిప్పావు ..
కొండంత సామాగ్రిని నా భుజాన వేశావు ..
ప్రేమను నీ ఆసరాగా మలిచావు ..!

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu