Suuryudu cheli chentaku cherukunna vela..
నీవు నిదురించు వేళ ..
నా కాంతి నిన్ను మేలుకొల్పు వేళ ..
నీ చూపులు తాకి నే చిన్నబోయేనులే ..
నా కాంతి నిర్జీవమాయనులే ..!
చెలి! నా కాంతి నులివెచ్చగా నిన్ను తాకే వేళ ..
నిన్ను చూచుటకు వచ్చితినే ..
కనులు తెరచి నన్ను కావవే ..
మారుదును చల్లని వెన్నెలలా నీవు నా చెంతకు చేరే వేళ ..!
చంద్రబింబం వంటి నీ మోమును చూచుటకు ..
ఈ సూర్యబింబం వచ్చితి ..
నీ అందంలో ఓలలాడుటకు ..
నేరుగా నీ ముంగిట వాలితి ..
ఆహా! చెలి ఏమి నీ సొగసు ..
ఈ సూర్యుడినే మైమరపించెను ..
ఓహో! చెలి ఏమి నీ వర్ఛస్సు ..
జగమును ఏలే ఈ ప్రభాకరుడనే నీ వద్దకు రప్పించెను ..!
ఓ! భువి తారకా ..
ఈ దివి రాజు ఏతించేనే ..
ఓ వన్నెల సారికా ..
మేలుకొనుము నీకోసమే నే వేచెనే ..!
నలుదిక్కుల వ్యాపించు నా కిరణాలను ..
నీ కొరకు బంధించి తెచ్చితినే ..
తొలి ఉషోదయ కిరణమును ..
నీకు అందించుటకు పరుగున వచ్చితినే ..!
సఖి! నా కొరకేనా నీ నిరీక్షణ ..
చెలి ! నేనేనా నీ ఫలించిన అన్వేషణ ..
నీవేలే భువిపై నా కలల మహారాణి ..
నేనేలే దివిన నీ ప్రేమ మహారాజు ..!
నా కాంతి నిన్ను మేలుకొల్పు వేళ ..
నీ చూపులు తాకి నే చిన్నబోయేనులే ..
నా కాంతి నిర్జీవమాయనులే ..!
చెలి! నా కాంతి నులివెచ్చగా నిన్ను తాకే వేళ ..
నిన్ను చూచుటకు వచ్చితినే ..
కనులు తెరచి నన్ను కావవే ..
మారుదును చల్లని వెన్నెలలా నీవు నా చెంతకు చేరే వేళ ..!
చంద్రబింబం వంటి నీ మోమును చూచుటకు ..
ఈ సూర్యబింబం వచ్చితి ..
నీ అందంలో ఓలలాడుటకు ..
నేరుగా నీ ముంగిట వాలితి ..
ఆహా! చెలి ఏమి నీ సొగసు ..
ఈ సూర్యుడినే మైమరపించెను ..
ఓహో! చెలి ఏమి నీ వర్ఛస్సు ..
జగమును ఏలే ఈ ప్రభాకరుడనే నీ వద్దకు రప్పించెను ..!
ఓ! భువి తారకా ..
ఈ దివి రాజు ఏతించేనే ..
ఓ వన్నెల సారికా ..
మేలుకొనుము నీకోసమే నే వేచెనే ..!
నలుదిక్కుల వ్యాపించు నా కిరణాలను ..
నీ కొరకు బంధించి తెచ్చితినే ..
తొలి ఉషోదయ కిరణమును ..
నీకు అందించుటకు పరుగున వచ్చితినే ..!
సఖి! నా కొరకేనా నీ నిరీక్షణ ..
చెలి ! నేనేనా నీ ఫలించిన అన్వేషణ ..
నీవేలే భువిపై నా కలల మహారాణి ..
నేనేలే దివిన నీ ప్రేమ మహారాజు ..!
Comments
Post a Comment