Cheli uude neeti budagalalo nundi cheluni maatalu

చిన్ని చిన్ని బుడగను ..
నే ఇలా ఎలా వచ్చెను ..
నా సఖి ఇలా ఎలా తెచ్చెను ..
తన ఊపిరి పోసి నాకు ప్రాణము ఇచ్చెను ..!

నీకొరకు నీటి బుడగానై వచ్చానే ..
నిన్ను చూచుటకు నీ ఊపిరిగా మారానే ..
ఇది క్షణ కాలమని తెలిసినా ..
నా మనసు అది అలొచించునా ..!

సఖి! నేను ఒక చిన్న బుడగను ..
నీ శ్వాస నుండి ఉద్భవించెను ..
నేను క్షణికము.. నా ప్రేమ అధికము ..
నీవే నా లోకమన్నది సత్యము ..

చెలి నీ హృదయ శ్వాస నుండి వచ్చితినే ..
నా హృదయము చీలక మునుపే నన్ను వరించవె ..
నీ సౌందర్యమునకు నే మైమరచితినే ..
ఎప్పటికీ నా హృదయ రాణివై నిలిచేవే ..!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu