Cheludu Cheluni nudutana Bottugaa maarina sandharbhamuna:

నీ నుదుటన తిలకంయ్యాను ..
నిన్ను విడిచి ఉండలేక ..
అక్కడే పచ్చబోట్టుగా ఉండిపోతాను ..
ఎప్పటికి విడువలేక ..

సూర్యుని కాంతిలా వెలిగాను ..                        
నిన్ను కాచుకొనుటకు నీ నుదుటను విరిశాను ..
చెలిగా నన్ను కావవా నిచ్చెలి ..
నీకు తోడునై ఉంటానే నా జిలిబిలి ..!

నీ మోమున విరిసిన మందారాన్ని ..
నిన్ను కాచుకొనుటకు వచ్చిన చెలుడిని ..
అందంగా నీ నుదుటపై ఒదిగితిని ..
అచటనే హాయిగా సేదతీరితిని ..!

చెలి! నీ మోమున అరవిరిసితిని ..
స్వచ్చమైన అగ్నిలా జ్వలించితిని ..
సంరక్షించుటకు వచ్చితిని ..
నీ స్వచ్చమైన మనసును కోరితిని ..!

ఏమి! నీ కనుల సౌందర్యం ..
ఏమి! నీ విశాల నుదుటి విలాసం ..
కనుబొమ్మల మధ్య ఆ సందడికి ..
నేను కానా ఒరవిడి ..!

ప్రియా నా ప్రాణ సఖియా ..
నిత్యం నీ వెంట ఉండే ఈ చెలియ ..
నీ నుదుటన బొట్టుగా మారాడు ..
చెలికి తోడుగా నిలిచాడు ..!

అందాల చంద్రబింబంలా మెరిశావు ..
నా నుదుటన విరిశావు ..
నన్ను చల్లగా కాచావు ..
నన్నుఅందాల రాశిలా చిత్రించావు ..!

ఓ! చెలి నీ కనుబొమ్మల మధ్య దాగుండనా ..
ఈ చల్లని సమయాన నులివెచ్చగా మారనా ..
నీ హృదయాన్ని దోచుకోనా ..
అందులోన నే దాగుండిపోనా ..!

అందాల నా చెలి నుదుటన కుంకుమ ..
మరింత అందాన్ని పెంచెను ..
ఆ కుంకుమ నేనై వచ్చానే ..
నీ మనసును గెలిచానే ..!

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu