Cheludu Chinukai Chelini Chaere vaela


చిన్ని చినుకుల వాన ..
సొగసరిగా జాలువారేనా ..
చెలి మోముపై చిలకరించేనా ..
ఆనందంతో తాను పులకరించేనా ..

వయ్యారంగా పైనుండి వాన ..
చెలుడు దాగే చినుకులోన ..
నా దరి చేరే వేగిగా ..
నా మనసులోనికి దూరే ప్రేమగా .

ఎడారిలో ఒయాసిస్ లా ..
చీకటిలో వెలుగులా ..
మోడువారిన బీడులో పూతోటలా ..
కరుణించావు నా ప్రియుని హృదయం కరిగించేలా ..

నా చెలి కొరకు వస్తున్నా ..
చినుకుగా మారి నీరందిస్తున్నా ..
ఆ స్వచ్చమైన మనసు కొరకు వస్తున్నా ..
అందులో నా స్తానసుస్తిరత కొరకు ప్రయత్నిస్తున్నా ..

చిరునవ్వులు రువ్వే చెలి కోసం ..
మబ్బులను సైతం కరిగించాను ..
ప్రేమ సాగరమై నిన్ను చేరుటకోసం ..
వాన జల్లుగా మారాను ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

Padati aabharanamulu

sneham