Posts

Naughty poem

My cute cute jaabili sweet sweet jilebi.. You are so so bubli.. Turning round and round like a googli.. Once turn to us and see us our naughty mogli.. My friends are waiting for you to see you and sleep like kumbi.. So you are always welcome to my home my jaangri..

Udayapu kavithaa sumam

తెల తెల వార వచ్చే.. మన కనులు తామర తూళ్ళు వలే విచ్చె.. మన హృదయం ఆనందమయమై స్పందించె.. మన మేని మరింత ప్రకాశమయమై కాంతి నిచ్చె.. ఆ తూరుపు అందాలు మనకై ఇటుగా వచ్చే.. ఆ ప్రసరనతో మన జీవమునకు సరికొత్త  శక్తీ వచ్చే..

Prakruthi hoyalu

తొలి సంధ్య కిరణాలు.. తెలి మంచు రాగాలు.. చిరు గాలి తాళాలు.. శెలయేటి నాట్యాలు.. ఈ అవని అందాలు.. చేసేను మన కనులకు విందులు..  జగతికి పసందులు..

Dhyaanapu shakthi

నింగి నేల గాలి నిప్పు నీరు.. అనంతంలా అవి సాగే తీరు.. అనూహ్యము అనన్యము నిత్య నూతనాలు..  మన జీవనానికి వాయులీనాలు.. ధ్యానించుము నిరంతరము.. మనలోని శక్తిని మేలుకోలుపెను..  నిత్య నూతన యవ్వనాన్ని ప్రసాదించేను .. మనసులోని కల్మషాన్ని తొలగించేను.. ఆనందమయమైన జీవితానికి సారధిగా నిలిచేను..

Manasu

కలల అలను చెదరనీకు .. కనుపాపను తడవనీకు .. చిరునవ్వును చెరగనీకు .. మనసును కలవరపడనీకు .. ఆనందాన్ని దూరము కానీయకు .. నీ హృదయ సవ్వడిని ఆలకించుము .. మనసు చెప్పే మాటను వినుము .. నీకు నీవుగా జీవించుము .. ఉన్నత శిఖరాలను అధిరోగించుము ..

Hrudayam

హృదయమా నా ప్రాణమా .. కొంటె ఊసులెన్నొ చెప్పేవుమా .. కలల కోరికలను పెంచేవుమా .. కష్టాలలో గుండెను దిటువు చేసేవుమా .. సుఖాలలో అందరికీ ఆనందాన్ని పంచేవుమా .. నీకు నీవే సాటిలేమ్మా .. నీవెంత కటినమో అంత సున్నితమమ్మా .. అందరి మంచిని కోరేవుమా .. హృదయమా అందరిలో మంచిని పెంచి .. చెడుని తొలగించి .. ప్రేమను పుష్పించి .. ద్వేషాన్ని తుంచి .. ఎలప్పుడు మంచిని గావించి .. నిలువుము అందరి ఆత్మీయ   బంధువుగా .. కలకాలం జనమందరి గుండెల్లో   చిరంజీవిగా ..                                                                 

Prakruthi

కాలాలు మారినా జాబిలి అందం వన్నె తరగనిది.. యుగాలు మారినా నీలి ఆకాశం మెరుపు తరగనిది.. ఎన్ని మెరుపుల కాంతులు ఇలలో వెలిగినా..  ఆ నక్షత్రపు కాంతుల జిలుగుల ముందు తుగేనా..  ప్రకృతి అందానికి లేదు సాటి ఈ జగాన..  మన ఈ ప్రకృతి హోయలను కాపాడుము.. హానికరమైన సామాగ్రిని నివారించుము.. కాలుష్యరహితమైన జీవనాన్ని గడుపుము..