Posts

Chilipi prasnanaa kavitha

   ఎదుటే నిలిచింది ..    అందంగా ముస్తాబైంది ..    ఆహ్లాదంగా తిలకిస్తుంది ..    చిరునవ్వులు చిందిస్తుంది ..    చూసినంతనే హాయినిస్తుంది ..    దరి చేరుటకు ఉర్రూగులూగుతుంది ..    తనకు లేరు సాటి అని విర్రవీగుతుంది ..    ఎంత చూసినా తనివి తీరదంటుంది ..     ఎవరా అనే కదా మీ సందేహం ..?!     ఏమనుకుంటున్నారు ..?     చందమామ అనా !!     కాదు..:-(     చెప్పెయనా ..:-)        అది...    అదేనండి ....       అద్దంలో మీ ప్రేతిబింబం ..:-))

Subhodaya Subhakaamshalu

తెల తెల వారే  .. కిల కిలమని పక్షులు ఎగిరే .. గల గలమని సెలయేళ్ళు జాలువారే .. సూర్య కిరణాలు భువిపై మెరిసే .. నేస్తమా ఇక మేల్కొనుము పువ్వులు విరిసే .. సరికొత్త రోజుకి స్వాగతాలు పలికే .. "శుభోదయ శుభాకాంక్షలు" తెలిపే ..

Talukkumanna taaraka

విను వీధిలో తారకలా మెరిసావే .. నా కనుపాప సందట్లో  తళ్క్కుమంటివే .. నా గుండె చప్పుడుగా మారవే .. నీ తలపులు ఓ నాదమై .. నీ అనుఅనువు ఓ స్వరమై .. నా శ్వాస ధ్యాస నీవై .. నీవు నాకు నీడవై .. నేను నీకు తోడునై .. వుందామా ఒకరికి ఒకరై .. దాగుడుమూతలు చాలించావే ఓ రాలుగాయి .. వన్నె చిన్నెల పావురాయి ..

Chandruni sogasu

పున్నమి చంద్రుని జిలుగులు .. ఆద్యంతం మనోహరము .. పున్నమి చంద్రుని రూపము .. కనులకు నయనానందకరము .. పున్నమి చంద్రుని లావణ్యము .. ఎంతైననూ వర్ణనాతీతము .. అందుకుందామా ఆ జిలుగును .. శ్వాసిద్దామా ఆ రూపమును .. ఆస్వాదిద్దామా ఆ లావణ్యమును .. ఇదేలే ప్రకృతి మాయ .. మదిని దోచి గుండె లయను మీటేను ఈ హోయ ..

Manishi saadhanaa polika

ఎగిరే గాలిపటం .. ఎగసి అందుకొనేను గమ్యం .. పై పైకి ఎగిరి పక్షి .. ఆగకుండు వలస వరకు అలసి .. పొంగి పొరలే నీరు .. అందుకునేను సముద్రపు జోరు .. ఎగిరి ఎగసి పొంగి సాగేను ప్రకృతి .. ఇష్టపడి కష్టపడి సాధించుకునేను మనిషి ..

Padati aabharanamulu

నీ అందం అదిరే మైమరపులు .. నీ పలుకులు తేనె మకరందములు .. నీ నడక నెమలి హొయలు .. నీ కనులు పుష్పించే తామరలు .. ఎంత వర్ణించినా తరగని చందములు .. జగతిన పడతి సొగసులు .. ప్రకృతి మారు రూపులు .. అందమునకు మెరుగులు .. ఈ ప్రేమ .. వాత్సల్యం .. కరుణ.. స్త్రీ అందమును పెంచే ఆభరణములు ..

Subharaatri sandesam

నిదురించుము చల్లని వెన్నెలలో .. ఆ జాబిలి మెరిసే విరితోటలో .. విరిగాలుల మైమరపులో  .. చక్కని పూల సువాసనలో  .. కలల విహారంలో  .. నిదురించి కాష్టాల్ని మరచి సేదతీరుము ఆనంద డోలికలలో  .. ఈ చల్లని రాత్రిలో  .. నీ కనులు వేగిగా సోలెనులే ఈ చిరు సందేశం నీవు చదివే వేళ ..