సఖి ఓ! నా ప్రియ సఖి .. ఈ చెలుని గుండె లయ నీవే కదా ఓ! చకుముఖి.. నీటిలోని ఈ తామర పువ్వు నీ కనులకు నే అందిస్తున్న కానుక ఓ! నా ప్రాణ సఖి.. ఇకనైనా నీ కొంటె చూపులతో నన్ను కావవే నా ఇష్ట సఖి..
స్నేహం ... ఒక అందమైన బంధం .. ఏ రక్తసంబంధం లేకున్నా .. అనుబంధాలకు అతీతమైన ఓ మధుర బంధం .. ఆ సంబంధానికి ప్రేతిరుపమే నీ స్నేహం .. చిన్ననాటి మన స్నేహం .. ఎదిగి ఈనాటికి మరింత బలపడి .. ఒదిగింది ఒక హరివిల్లులా .. మంచితనానికి నిలువుటద్దంగా .. సహాయానికి చిరునామాగా .. స్టైల్ లో ట్రెండ్ సెట్టర్‌గా .. నిలిచినా ఓ మిత్రమా .. నీ స్నేహానికి జోహార్ల్ ..
నీ అందం అదిరే మైమరపులు .. నీ పలుకులు తేనె మకరందములు .. నీ నడక నెమలి హొయలు .. నీ కనులు పుష్పించే తామరలు .. ఎంత వర్ణించినా తరగని చందములు .. జగతిన పడతి సొగసులు .. ప్రకృతి మారు రూపులు .. అందమునకు మెరుగులు .. ఈ ప్రేమ .. వాత్సల్యం .. కరుణ.. స్త్రీ అందమును పెంచే ఆభరణములు ..
Comments
Post a Comment