Cheludini haaramugaa dharinchina sogasariki naa kavithaa spandanalu
నీవు నా కనుపాపవే .. నీవు నా చిరునవ్వువే .. నీవు నా అందాల చేలికాడివే .. నీవు నా కంఠహారమై నిలిచి నన్ను కావవే .. ప్రియ, ఓ ప్రియా .. నీవే కదా నా గుండె లయ .. చేశావే ఎదో మాయ .. నిన్ను నా కంఠహారముగా ధరించి నీదానిగా మారిపోయా .. చెవులకు జూకాలు అందం.. పెదవులకు చిరునవ్వు అందం .. చేతులకు సింగారాల గాజులు అందం .. నీవే నా కంఠమందు హారమై నిలుచుట నాకు ఆనందం .. చెలి ఎచటికి వెడలిదవు .. నన్నెప్పుడు చేరెదవు .. నీకోసమే కదా ఈ వలపుల దీవు .. రారాదా నా దరికి నా మని హారమై నీవు .. తీయ్యని పలుకుల గొంతుకకు .. సన్నని నెమలి సొగసుగల కంఠమునకు .. నేను కానా నీ కంఠహారము .. అందాల సిరిగల మనిహారము .. తలపుల తలుపులు తెరిచావే .. ఎన్నో మలుపులు తిప్పావే .. నా మనసు నీవైపుగా వచ్చెనే .. నా తనువు నీ కంఠహారమై నిలిచేనే .. సోల కళ్ళ సొగసరి .. చిలిపి నవ్వుల గడసరి .. నాపై నీకెంత ప్రేమ నా లాహిరి .. నన్నే మాలగా ధరించితివే వయ్యారి .. పలు రకముల హారములు తిలకించితినే .. ముత్యాలు పొదుగులు కాంచితినే .. రత్నాల సొబగులు వీక్షించితినే .. చేలుడే హారమగుట చూచి మైమరచితినే .. నిన్ను చూచినా కానరాక .. ఈ విరహమును తాళ