Cheli momu addamuna cheludai avishkruthamaina vela
ఉదయాన్నే అద్దమున నా మోమును చూడదలచే .. కాని నా హృదయమున దాగిన నిన్ను చూచే .. నన్ను ఆశ్చర్య చికితులను గావించే .. ఇది వింతగా తోచే.. నీ ప్రేమ నన్ను మైమరచే ..! చెలి ఏమిటలా చూస్తున్నావు .. నేనే .. నిన్ను వలచిన నీ ప్రాణ దాసుడను .. నాకోసమే కదా నిరీక్షిస్తున్నావు .. నిన్ను చూచుటకు బింబమై ఈ విధముగా వచ్చాను ..! చెలి నీ బింబాన్ని నేను .. నా ప్రేతిబింబానివి నీవు .. ఈ అద్దము కలిపెను ఇద్దరినీ .. ఒకరిపై ఒకరి ప్రేమను తెలుసుకొమ్మని ..! ఇది బింబమా .. లేక హృదయ భాషా పరికరమా .. నా ఎదురుగా నా చెలికాడు .. బింబమున నా ప్రేమ సాక్షిగా నిలిచాడు ..! చెలి నీకోసం వచ్చాను .. ఈ బింబమున దర్శనమిచ్చాను .. చిరునవ్వులు చిందిస్తూ నీముందు నిలిచాను .. కలకాలం మనం ఒకరికిఒకరు తోడనే మాటను చెప్పదలచాను ..! సఖి నీవే నేను .. నేనే నీవు .. నేను నువ్వు ఒక్కటని .. ఈ అద్దము తెలిపే మనము సరిసమానమని ..! ప్రియతమా ! చూసావా ఈ వింత .. నిన్ను చూడక ఉండలేక .. చేరితిని ఇలా నీ చెంత .. బింబమై వచ్చా విరహాన్ని తాళలేక ..