Cheludu cheli maenupai kurchuni cheli kurulalo jaabilini veekshinche vela

చెలి నీ మేనుపై కుర్చుంటి..
నీ కురుల వంక చంద్రుని కంటి ..
నీవు అందమునకు నిర్వచమని వింటి ..
ఇప్పుడు కళ్ళారా వీక్షించుచుంటి ..!

నీ కురులు నీలాకాశంగా మలిచితి ..
అందున చంద్రుని వెలుగు ఆహ్లాదంగా గావించితి ..
అది వీక్షించుటకు బుడతడినయి వచ్చితి ..
నీపై కుర్చుని ఈ వింతను కాంచితి ..

చిలిపి చంద్రమా ..
ఇవి నా చెలి కురులు కదుమా ..
భువిపై దిగి ఇటుల కాంచితివా ..
ఈ సుందర దృశ్యము మా కనులకు విందుగా మలిచితివా ..!

వయ్యారి భామ హొయలలో ..
చిలిపి చంద్రుడి హేల ..
నా వర్ణనల మాయలో ..
చిన్నది పులకించి పడెను నా ప్రేమ వలలో  ..!

నీ మేనుపై వాలిన సోగ్గాడిని ..
నీ ప్రేమ కోసం తపిస్తున్న చేలికాడిని ..
నీకోసం దరిచేరుస్తున్నా ఈ చంద్రుడిని ..
వెన్నెల కురిపించి నీ మనసును నా వైపునకు మళ్ళించమని ..!

పున్నమి జాబిలి చిక్కుకుంటి ..
నీలాకాశం అనుకుని నీ కురులలో ..
నా మనసు చిక్కుకుంటి ..
ప్రేమ అనే నీ హృదయ వాకిట్లో ..!

జాబిలి చిన్నబోయను నీ దరిచేరగానే ..
నా కనులు చేదిరిపోయను నిన్ను చూడగనే ..
వచ్చితి నీ ప్రేమ పొందుటకు వెంటనే ..
ఉంటాను ఎల్లకాలం నీ చెంతనే ..!

జాబిలి అందం కనిపించే నీ మోమున ..
వెన్నెల మైమరపు మురిపించే నీ సొగసున ..
వచ్చితి ఆ ఆకాశపు సిరిని అందించుటకు ఒక్క ఉదుటున ..
మన ప్రేమ గుర్తుల మాటున ..!

ఓ చెలి! జాబిలి వచ్చితి నాకు పోటి ..
నాకు కాలేదు అది సాటి ..
నేనే నిన్ను ప్రేమించుటలో ధీటి ..
మన ప్రేమే కదా జగతిన మేటి ..!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu