Cheli kurulu venaka daagina cheludu

దోబుచాటల చిన్నారి ..
నీలి కురుల సొగసరి ..
నీ మాటునె దాగాను ఆటగా ..
ఉండిపోతా దీటుగా నీ జంటగా ..

అలలా జాలువారే నీ కురులలో ..
నేను కూడా అవుతాను ఒక అలను ..
మేఘాల్లా తేలియాడే నీ శిరులలో ..
నేను అవుతాను నీ వలపుల సిరిని ..

ఏ చెలి ఏమి చేస్తున్నావు ..
నీవు నా గుండె లయవు ..
నీవు నా హృదయ స్పందనవు ..
ఓ సఖి! మరి ఏల నా కురులలో దాగినావు ..

చంద్రబింబం వంటి నీ మోమునకు ..
హరివిల్లులా వంగే నీ కురులకు ..
ఊయల ఊగనా చేరే వరకు నీ మనసునకు ..
దాగి ఉండనా నీ వెనుక తోడు కొరకు ..

కాటుక కన్నుల చెలి అందం అనిర్వచనీయం ..
చిలిపి నవ్వుల చెలి సొగసు అద్భుతం ..
నా చెలి విరులు నదీ ప్రవాహం ..
అంతటి నా చెలి ప్రేమ అమృతం ..
దరి చేరుటకు ఇది నా ప్రయత్నం ..

అమ్మ చాటు బిడ్డలా ..
నా చెలి చాటున నేను ..
ఉంటాను ఎల్లవేళలా ..
కురులను అంటిపట్టుకుని..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu