Cheli gnapakaalalo

అందాల ఓ పడతి ..
మనసైన నీకోసం ..
నే వస్తానని ఇస్తున్న వినతి ..
నీ వెనుకే నేనుంటానికి అడుగుతున్నా అనుమతి ..

నా చెలి వెలుగు కొరకు ..
నే చీకటి లో ఉన్నా ..
తన సుఖ సంతోషాల కొరకు ..
నే కష్టాలు కడలిలో  మునుగుతున్నా ..

చీకటిన కనపడని నీ రూపం ..
వెలుగున అది అపురూపం .
కష్టాల ఒరిమికి నీవు వెనుకనున్నా ..
నీడనై ఉంటా వెలుగున రమ్మని భరోసా ఇస్తున్నా ..

చెలి .. నా వెంటే నీ జ్ఞాపకాలు ..
నా ఊహలలో ఉండేవు అనుదినం ..
నీవు విడిచాక ముసిరాయి నా జీవితాన చీకట్లు ..
నీ తలపుల మాటున సాగుతున్నా ప్రతిక్షణం ..

చెలి నీవే నా తోడని అనుకున్నా ..
నా జీవితాన వసంతమై వస్తావని ఆశించా ..
వెలుగును పంచే నీవే ..
చీకటిని నింపావే ..

మోడుబారిన ఈ జీవితాన ..
ఆశల చిగురులు తోడిగావే ..
మదిన పూల వాన కురిపిస్తావని తలచాను ..
కాని ఊబిలోన నన్ను దింపావే ..

నీవు నాలో సగం ..
నేను నీలో సగం ..
మనిద్దరం సగం సగం ..
తోడు నీడై ఉందామా క్షణ క్షణం ..

చెలి నీ కురుల అలలో దాగున్నా ..
నీకోసమే నిరీక్షిస్తున్నా ..
నా దరి చేరెదవని ఎదురుచూస్తున్నా ..
నీ  జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపేస్తున్న ..

నీడలా నా వెంట ఉండితివని తలచా ..
అందుకే నిన్ను కోరి మరీ వలచా ..
పరిచయాన్ని ప్రేమగా మలచా ..
కాని జ్ఞాపకాల నీ నీడలలో నిలిచా ..

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu