Posts

Ugadi 2023

 అంతులేని కాలానికి ఆది.. కొత్త ఆశలకు  పునాది..  మామిడి పూతల పూలతిది..  షడ్రుచుల కొలనిది..  ఆనందాల ఊయలూగే ఉగాది..  శుభాలు తెచ్చే  పండుగిది..  శోభలు పంచే శోభకృత నామ సంవత్సరమిది..  అందరికి శుభాకాంక్షలుతెలిపే తరుణమిది..  మీకివే మా "శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"...

sneham

స్నేహం ... ఒక అందమైన బంధం .. ఏ రక్తసంబంధం లేకున్నా  .. అనుబంధాలకు అతీతమైన ఓ మధుర బంధం .. ఆ సంబంధానికి ప్రేతిరుపమే నీ స్నేహం .. చిన్ననాటి మన స్నేహం .. ఎదిగి ఈనాటికి మరింత బలపడి .. ఒదిగింది ఒక హరివిల్లులా .. మంచితనానికి నిలువుటద్దంగా .. సహాయానికి చిరునామాగా .. స్టైల్ లో ట్రెండ్ సెట్టర్గా ..  నిలిచినా ఓ మిత్రమా .. నీ స్నేహానికి జోహార్ల్ ..  

harivillu ee jeevitham

విరిసే ఆనందం పూల వానలా .. కురిసే నవ్వుల చినుకులా .. మెరిసే ఆత్మీయ జల్లులా .. ఎన్నో శిలలపై శిల్పాలా .. కలం నుండి జాలువారే వాక్కుల బాణంలా .. కన్నీటి నదీ ప్రవాహంలా .. కష్టసుఖాల సమ్మేళనంలా .. జీవితం సాగే హరివిల్లులా ..

aenaatidoo

ఆకాశం ఏనాటిదో .. హరివిల్లు ఆనాటిది .. ఈ సృష్టి ఏనాటిదో .. ప్రాణుల జీవనం ఆనాటిది .. జీవనం ఏనాటిదో .. సుఖ సంతోషాలు ఆనాటివి .. ఏది ఏనాటిదైన సాగే ప్రయాణం ఈనాటిది .. కలిసి నడుద్దాం ఆనందోస్సాహాలతో .. ప్రతి క్షణం బోసి నవ్వుల పాపల్లా .. జగమంతా ఒక్కటై నదీ ప్రవాహంలా ..  

Krishna Krishna raa raa

గోపాల కృష్ణయ్య  నంద నందన .. యదుకుల కృష్ణయ్య నంద నందన ..  మా చిన్ని కృష్ణ రా రా .. !! చెడు అనే మన్నును తినేవురా .. కంసాసుర సంహారా రా రా .. !! మంచి అనే వెన్నను అందరికి పంచేవురా .. గోప కిషోర రా రా ..!! నీ చరణమే శరణమని మొక్కెదమురా .. నిను తలచి తలచి అన్వెషించదమురా .. అన్నిటా నీవేనని తెలిసి ..  నీవద్దకు మోక్షము కొరెదమురా ..   

Gelupu

గెలుపెవరిది .. !!?? నింగి నేలలో గెలుపెవరిది .. నీరు నిప్పులో గెలుపెవరిది .. ఎండ వానలలో గెలుపెవరిది .. సూర్య చంద్రులలో గెలుపెవరిది .. ఉరుము మెరుపులలో గెలుపెవరిది .. అన్ని దిశల అంతయూ సమానమే .. గెలుపు ఓటమి అనిన నిలిచేది ఏది లేదే ..  కేవలం మంచితనపు మమకారం శాశ్వతమే  .. అదే అన్నిటా అంతటా గెలుపుకు సమానమే ..

madhurame madhurame

మధురమే మధురమే .. విరించే  కనులు మధురమే .. సన్నగా సాగే పాట మధురమే .. చిన్ని చిన్ని ముత్యపు చినుకులు మధురమే .. విరి గాలి వీచిక మధురమే .. మబ్బుల చాటు చంద్రుని రూపు మధురమే .. ఉదయించే సూర్యుని ప్రకాశం మధురమే .. జల జల పారే నీటి ప్రవాహం మధురమే .. మధురపు మధురానుభూతుల సంగమము మధురమే ..!!

maarpu

మనసు మనసు కలిసే .. చేయి చేయి కలిసే .. ఇరు కనులు ముచ్చటించే .. ఆనందసాగరంలో తేలియాడే  .. మంచితనపు లోగిలికి పూబాటాయె .. మూర్కత్వపు సంకెళ్ళను తెంచే .. అన్యాయపు వాకిళ్ళను తరిమేనే .. జన వాహిని స్వచ్చతకు మారురూపుగా అవతరించే .. అని కలగా లీలగా అనిపించే .. అది నిజమయి సాగాలని ఆశించే  .. సకల జగతికిది విన్నవించే ..
నదీ తీర సమీరం .. జీవన పోరాట సమరం .. తెలిపెను అనుక్షణం సమయం .. కన్నుల కాంతుల నిరీక్షణం .. సాగెను విరివిగల పోరాటం .. దాగేనులే విజయపు శిఖరం .. అందుకో మిత్రమా .. కష్టే ఫలే నేస్తమా ..
వెండి మనసా  .. తుళ్ళి పడకే .. ఇంత అలుసా.. మదన పడకే .. నీటి సంద్రమా .. అలల తాకిడి తప్పదే .. ఎంత లోతైనా .. ఈదక మానేనా .. ఉరుముల హోరుకి .. చినుకులు ఆగేనా .. అటులనే సాగే జీవితానికి .. ఎదురీత తప్పేనా ..

Neeti jallu

చిన్న చిన్నగా కురిసే నీటి జల్లు .. చిన్నారి మురిపెంలా విరిసే హరివిల్లు .. ముచ్చటగా మురిసే పొదరిల్లు .. అందంగా ఒదగవే నీటి ముల్లు .. మా లోగిలిలో ముగ్గులా పరచి వర్ధిల్లు .. భువిని పులకింప చేసి అందించు మాకు వరాలు .. దివిని భువిని కలుపు దూరాలు వాన సుదురాలు ..

Prakruthi vadilo madi melukolupu

అందమైన వెన్నెలలో .. ఇసుక తిన్నెలలో .. నక్షత్ర మిలమిలలో .. అలల పొంగులో .. ఆకాశ నీలి మేఘాలలో .. నీవు చుస్తూ .. మయమరుస్తూ .. నిదురించు హాయిగా పాత బాధలన్ని మరుస్తూ .. కొత్తగా సరికొత్త కలలకి ఊతమిస్తూ .. నిన్ను నీవు అపురూపంగా మలుస్తూ .. రేపటి ఆశా జ్యోతివై వెలుగుల్ని పంచుతూ .. ప్రేమకు ప్రతిరుపమై జీవితాన్ని సాగించు .. నిన్ను నీవు గెలుస్తూ పయనించు ..

Cheludu Chinukai Chelini Chaere vaela

చిన్ని చినుకుల వాన .. సొగసరిగా జాలువారేనా .. చెలి మోముపై చిలకరించేనా .. ఆనందంతో తాను పులకరించేనా .. వయ్యారంగా పైనుండి వాన .. చెలుడు దాగే చినుకులోన .. నా దరి చేరే వేగిగా .. నా మనసులోనికి దూరే ప్రేమగా . ఎడారిలో ఒయాసిస్ లా .. చీకటిలో వెలుగులా .. మోడువారిన బీడులో పూతోటలా .. కరుణించావు నా ప్రియుని హృదయం కరిగించేలా .. నా చెలి కొరకు వస్తున్నా .. చినుకుగా మారి నీరందిస్తున్నా .. ఆ స్వచ్చమైన మనసు కొరకు వస్తున్నా .. అందులో నా స్తానసుస్తిరత కొరకు ప్రయత్నిస్తున్నా .. చిరునవ్వులు రువ్వే చెలి కోసం .. మబ్బులను సైతం కరిగించాను .. ప్రేమ సాగరమై నిన్ను చేరుటకోసం .. వాన జల్లుగా మారాను ..

Cheludu Cheli jadatho thananu chere vaela

వయ్యారి జాణ .. వాలుజడ కూన .. చిక్కింది నా చేతిలోన .. అలలా పాకి తన మనసును దోచుకొన ..! వాలు జడ .. వయ్యారి మెడ .. నాకు చిక్కెను చూడ .. కలిగెను నా గుండెకు చిలిపి దడ ..1 నిన్ను చేరాలనే తపన .. నాలో కలిగించెను చిలిపి ఆలోచన .. నిన్ను చేరుటకు చూపించెను ఈ జడ ఓ సూచన .. నీ మది చేరుటకు ఇది నాకో నిచ్చెన ..1 చిలిపి కళ్ళ సొగసరి .. వాలు జడల గడసరి .. నిన్ను చేరుతానే ఇలా సరాసరి .. నా చెలిగా కానుకందించవే మరి ..!

Cheli sigalo Cheluni Uusulu

చెలి నీ సిగలో ఆభరణమవుత .. అందంగా మెరుస్తా .. నీ మనసులో  ప్రేమనవుత .. నిన్ను నాదానిగా మారుస్తా ..! సిగ వయ్యారి .. విరి మయూరి .. నా సింగారి .. నువ్వే నా హృదయ చోరి .. నా చెలి సిగలో మల్లెదేండలా మారనా .. మనసులో చోటు సంపాదించనా .. నా కలల రాణివి నీవని చాటించనా .. నా హృదయమును నీకు అర్పించనా .. సిగగల విరితోటలో నేను .. అరవిరిసిన మందారమై నీవు .. చల్లగా సాగుదామా .. మన ప్రేమవైపునకు జారుకుందామా ..

Cheli thalapullo cheludu maedile vaela

నా ఎదలోన నీవే .. నా మదిలోన నీవే .. నిన్ను తలచు ఈ వేల .. నాలో రేగే విరహాగ్ని జ్వాల .. అందమైన నీ రూపం .. నాకెంతో అపురూపం .. మెదుల్తావు ఎల్లప్పుడూ నా ఊహల్లో .. ఉంటావు కలకాలం నా గుండెల్లో .. కనులు మూసినా నీవే .. కనులు తెరచినా నీవే .. నా ప్రపంచమంతా నీవే .. నా జీవితమంతా నీకే .. నా గుండె చప్పుడుగా ఉన్నావే .. నా శ్వాసగా నిలిచావే .. నీ దర్శనం కొరకు వేచానే .. నన్ను మన్నిస్తావని నీ మదిలో మేదిలానే .. చెలికాడి రూపం నన్ను మైమరచే .. ఆ తలంపే నన్ను ఊహాలోకమున తేలించే .. నీ మాటలు నన్ను గిలిగింత పెట్టె .. నీ చేష్టలు నవ్వుల మూటలు కట్టే .. ఏమి నా చెలి సోయగం .. తను లేక నాకు వియోగం .. వచ్చా అందుకే తన ఊహల్లోనికి .. తెరుస్తుందని తన మనసు ద్వారం .. ప్రేమ చిగురుల మనిహారాణికి ..

Ivi teerevaela

ఎన్నో విషయములు జ్ఞప్తికొచ్చే .. అవి కళ్ళముందు ముసిరే వేల .. ఎన్నో ఆశలు చిగురులు తొడిగే .. అవి తీరేవేల .. ఎన్నోఊహలు ఉవ్వెత్తున లేచే .. మనసు పులకించే వేల .. ఇది ఏదైనా అనుబంధ మాలలు పూచే .. చెట్టు బలమైన నమ్మక పునాదిలో బలంగా ఉండేవేల ..!!

Cheli vedimini tattukoni godugu kinda saeda teere vaela

నా చెలి చేసే ధ్యానం .. సూర్యాగ్నితో చేయకు భంగం .. చూపకు నీ ప్రతాపం .. ఈ గొడుగు చేసే సాయం .. వేడిమిని తట్టుకునెట్టు చేసే సాధనం .. చెలి ఈ వేడిమి .. ఒక నిప్పుల కొలమి .. నాతో చేసే చెలిమి .. నన్ను కావవా ఓ ప్రేమి .. ఆకాశాన సురీడు .. నేలపై ఈ రేడు .. భగ్గుమనె నేడు .. ఈ గొడుగు నన్ను కాపాడే చూడు .. సూర్యుని భగ భగ .. మెరిసేను నిగ నిగ .. నా చెలిపై సెగ సెగ .. పడకుండా తనకి  శిక్ష శిక్ష .. ఈ గొడుగుతో  చేసే రక్ష రక్ష .. వేడిమి సైతం చిన్నబోయెను .. మబ్బులు గుమ్మేత్తున వాలేను .. చల్లగా అంతా మారిపొయేను .. నా చెలుని జ్ఞాపకాల నీడన .. వేడిమి శక్తిని .. గొడుగు అడ్డుకొని .. మనలను కాపాడును .. వెన్నెలగా మార్చును .. చెలి ప్రేమ మాదిరి  ..

Chelikaadu cheli taage taeneeruna aaviraina vaela

నా శ్వాశ నీవే .. నా ద్యాస నీవే .. తాగే తేనీరులో నీరు నీవే .. నా గొంతుకలో శ్రుతి నీవే ..!! అందాల చెలికాడు నా ముందు .. పంచెను నా కనులకు విందు .. ప్రత్యక్షమయ్యే అన్నిటా .. నా మనసు వాకిటా ..!! సెగలా ఎగసావు .. నా గుండెలో ఒదిగావు .. నీరులా పారావు .. నా కంటి పాపలో దాగావు ..!! కప్పు తేనీరు .. మనసును ఉత్తెజపరుచును .. అందున నీ ప్రేమ .. మన బంధాన్ని గట్టిపరుచును .. చెలి మోము చూచుటకు .. వచ్చితిని ఇటుల వేడి సేగానై .. తన ప్రేమ పొందుటకు .. దక్కనంతనే నే వెళ్ళిపోతా ఆవిరినయి ఈ ఆవిరి .. నా ప్రేమ లాహిరి .. నా కలలకు ఊపిరి .. మనసున పెట్టు గిలిగిలి ..

Samudra andam

అందాల సాగరం .. నయనానందకరం .. అలల ప్రవాహం .. మధుర మధురతరం .. ఆ హోరు ఆనందతరం .. సముద్ర గాలి మనోహరం .. అటువంటి ఆ లయం .. ఆకాశం నేల కలసినట్టు .. అందున ఎర్రని బొట్టు .. ప్రకాశించే కిరణం .. కలసి చేసే ప్రయాణం .. చూపరులకు పంచేను వినోదం ..