అందాల సాగరం .. నయనానందకరం .. అలల ప్రవాహం .. మధుర మధురతరం .. ఆ హోరు ఆనందతరం .. సముద్ర గాలి మనోహరం .. అటువంటి ఆ లయం .. ఆకాశం నేల కలసినట్టు .. అందున ఎర్రని బొట్టు .. ప్రకాశించే కిరణం .. కలసి చేసే ప్రయాణం .. చూపరులకు పంచేను వినోదం ..
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో .. ఎంతో ఎంతో మరెంతో .. అంత అంత అంతంత .. ఇంత ఇంత ఇంతింత .. వెలుగు రేఖల వెలుగంత .. ఈ విశాల సృష్టంత .. మనసుల లోతంత .. ఆ విధాత రాతంత .. ఈ ప్రకృతి పులకింత .. ఆనందించాలి మనమంతా ..
నీకోసమే నేనున్నా .. నీకోసమే వస్తున్నా.. ఈ వేడిమిలో నడిచి వస్తున్నా .. నా చెలి ప్రేమ కోసం .. అనురాగ బంధం కోసం ..!! చెలి చూపులు .. అవి కలువ పూరేకులు .. ఎంత కష్టాన్నైనా మరపించు మంచు బిందువులు .. గమ్యాన్ని చేరుకొనుటకు చూపు మార్గదర్శకాలు ..!! ఇంతటి వేడిమి .. నిప్పుల కొలమి .. ఐనా నీ చెలిమి .. చేసెను నిప్పుని చన్నీటి కొలమి ..!! ఆకాశపు భగ భగ .. ఆకలి నక నక .. కాని చెలి చూపుల నిగ నిగ .. నన్ను నడిపించెను చక చక ..!! కొంటె చూపుల వయ్యారి .. పాల బుగ్గల కావేరి .. నీకోసమే కదా ఈ పాట్లు .. ప్రేమ గెలుచుటకు ఈ అగచాట్లు ..!! కొండలు దాటి .. గుట్టలు దాటి .. రేయి పగలు మరచి .. ఎంత కష్టాన్నైనా ఓర్చి .. వస్తున్నా నిచ్చెలి ప్రేమ గూర్చి ..!! సుఖమున నీవు .. కష్టమున నేను .. తోడుంటా అనెను .. నీ దరి చేరుటకు ఇటుల పూనెను ..!! వినవ రావా నా మాట .. రావా ఈ చెలికాడి బాట .. కలసి పయనిద్దాం .. మన ప్రేమతో ప్రపంచాన్ని జయిద్దాం ..!!
రామ రామ పరంధామ .. ఇలకు వచ్చిన ఇలవంశ ధీమా .. తోడుగా వచ్చెను చూడు హనుమ .. సీతా సమేత రఘు వంశ సోమ .. జన్మదిన వేడుకన అయ్యను కళ్యాణ రామ .. అందించెను అందరికి ఆశీస్సులు ఆ మేఘశ్యామ .. ఈ సందేశం తెలిపెను "శ్రీరామ నవమి శుభాకాంక్షలు" ఈ పర్వదినాన ..
జగదభి రాముడు మన శ్రీరాముడు .. మంచికి నిర్వచనం తెలియచెప్పిన లోకాభిరాముడు .. కుటుంబ విలువలు నేర్పిన కౌసల్య రాముడు .. చెడు సంహారానికై దిగివచ్చిన రఘువంశ తిలకుడు .. జన్మించి మన కొరకు వచ్చెను ఈ నవమి నాడు .. ఆ ఆదర్శమే ప్రపంచమున అందరు నిలుపుకోవాలని .. ఈ రోజు అన్ని శుభాలకు ఆలవాలమవ్వాలని .. కలగాలని ఆ అయోధ్య రాముని ఆశీస్సులు .. తెలిపేను అందరికి " శ్రీరామ నవమి శుభాకాంక్షలు " ..
ప్రియమైన స్నేహితులు .. అందమైన ఊహలు .. ఎన్నో గిలిగింతలు .. మరెన్నో గిల్లికజ్జాలు .. వింత ధోరణలు .. కొత్త పోకడలు .. అబ్బురపరిచే చేష్టలు .. ప్రేమాను బంధాలు .. కలిసి మెలిసి చేసే అల్లర్లు .. గడియ గడియకొక జరిగే మార్పులు .. ఇవి మన చిలిపి సంగతులు .. ఎంతకాలమైనా చెరగని విశేషణములు ..
కొమ్మ కొమ్మకి ఒక కోయిలమ్మ .. వినసొంపుగా కూసెనమ్మ .. చెట్టు పుట్ట సైతం మైమరచనమ్మ .. కొమ్మ కొమ్మకి ఇంకో చిలకమ్మ .. అలవోకగా కబుర్లు చెప్పెనమ్మ .. ఆ కొయిల గానంతో .. చిలకల పలుకులతో .. చెట్టు చేమ గుసగుసలడుకోనేను .. ఎవరు గొప్ప అని ఆలోచించసాగెను .. ఎవరి ప్రతిభ వారిదని నిర్ణయానికి వచ్చెను .. ప్రపంచాన ఏది కాదు అనర్హం .. అన్నిటా అందరిలోను తప్పక ఉంటుంది ప్రతిభా పాటవం .. ప్రోత్సహించిన తప్పక వేలుగొందును గొప్పతనం ..
ఎండాకాలపు వేడిమి .. చలికాలపు మంచు కొలమి .. వసంత కాలపు చెలిమి .. వర్షాకాలపు కిలిమి .. అంతా మన మేలిమి .. ప్రకృతికెంత ఓరిమి .. అన్నిటిని ఒకటిగా .. ఏదైనా సమానంగా .. ఆహ్వానిస్తుంది హాయిగా .. మనలనుకూడా చేస్తుంది జిలిబిలిగా .. తట్టుకోమని జీవితపు ఒడిదుడుకులను .. సమానంగా అన్నిటిని చూడమని ..
ఎంత ఎంత వింత .. అంత అంతే అంతా .. ఎంతైనా అది కొంత .. విచిత్రమైన చింత .. కాదనలేని పొంత .. వింత అంతై అంతా .. పాకెను ఊరంతా .. చూసేను జనులంతా .. ఏమిటా అని ఆశ్చర్యంతో అంతా .. ఇంతకి తెలిసింది ఆ వింత .. ఆకాశం లోని పాలపొంత ..!!
కళ్ళు పలికే ఎన్నో ఊసులు .. అవి మాటకు అందనివి .. మౌన భాషగా సాగేవి .. చెప్పేను ఎన్నో సంగతులు .. తలపులు తలుపులుగా విచ్చేను ఆ కలువలు .. ప్రపంచ సౌందర్యమును చూపే కనులు .. అమూల్యమైన సంపద ఈ కనులు .. పదిలముగా కాపాడుకొనుము .. అనంతరం మన దానము .. వేరొకరి సంపద ఫలము ..
వసంత కాల సరాగం .. కోయిల పాడే సుస్వరం .. మది నిండుగా పులకించే అనురాగం .. వినులవిందు ఆ కమనీయ గళం .. కాలాతీతంగా సాగాలి ఈ మధుర గానం .. అనేది మన చిన్ని కోరిక .. ఆశిద్దాం జరుగుతుందేమో ఆనక ..!!
తెలుగింటి ఓ బంగారు బొమ్మ .. పిలిచెను నిన్ను ఈ కిలకల కొయిలమ్మ .. తియ్యగా నిన్ను పలుకరించేనమ్మ .. చెలివై రావే నా అందాల పైడి బొమ్మ .. ఓ చెలి ఈ చెట్టు కొమ్మన నిలుచోమ్మ .. నీ చెలికాడినయి నీకు నీడగా నిలిచేనమ్మ .. నా ప్రేమ నీకేనమ్మ .. ఈ కొయిల నీకు అది వివరించేనమ్మ .. నా చెలి సోయగం .. నాకు ఆరాధనా పూర్వం .. వసంత కాల కోయిల .. నిన్ను పిలిచే రాలుగాయిలా .. ఈనాడే వచ్చే ఉగాది .. నా చెలి రాకతో .. వసంత కాలం మొదలయింది .. ఆమని కూతతో .. బుట్ట బొమ్మలా ఉన్న నీ ముస్తాబు .. చిట్టి కొయిలమ్మ అదరహో అని కితాబు .. చెట్టు పుట్ట సైతం నిన్ను చూస్తూ .. ఉండిపోయాయి మయిమరుస్తూ ..
ప్రియా ఈ పువ్వులో పువ్వునై వచ్చానే .. ముళ్ళు నన్ను బాధిస్తున్నా .. నీ ప్రేమ పొందుటకు ఇటుల మారానే .. ఇకనైనా నీ చిరునవ్వుల వరమిస్తావని ఆశిస్తున్నా ..! రోజా తెచ్చాడు ఈ రాజా .. నా హృదయ రోజా ప్రేమ కొరకు .. అది చూసి మయిమరచింది నా రాణి .. అందున దాగున్నఈ రాజా రూపాన్ని చూసి ..! పువ్వునై వచ్చానే .. నీ చేతిలో ఒదిగానే .. నీ కళ్ళలో మెరుపును చూసానే .. నా ప్రేమకు అది నీ స్పందనని తలచానే ..! ఏమి ఈ గులాబి మాయ .. నాతో ఊసులాడుతుంది .. నన్ను గిలిగింతపెడుతుంది .. ఇది గులబినా లేక నా ప్రేమ మాయా!! చెలి నీవు నేరజానవే .. నన్నే పువ్వుగా మార్చావే .. నీ జడలో అమర్చావే .. నా ప్రేమతో వాడని పువ్వునై అచటనే ఉంటానే ..! అందమైన నా సఖి కొరకు .. ఈ అందమైన ప్రేమ కానుక .. నిన్ను చూడక ఉండలేక .. పువ్వునై వచ్చా విరహాన్ని తాళ్ళలేక ..! చిన్నారి పువ్వులో చేలుడిని .. నీ ప్రేమ వలపుల దాసుడని .. కొంటె కొనంగికి ఇస్తున్నా ఈ గులాబిని .. నా ప్రేమ అంగీకారం తెలుపమని ..1