Koila gaanam chelini piliche vela maanu chelidai varnisthuna haela

తెలుగింటి ఓ బంగారు బొమ్మ ..
పిలిచెను నిన్ను ఈ కిలకల కొయిలమ్మ ..
తియ్యగా నిన్ను పలుకరించేనమ్మ ..
చెలివై రావే నా అందాల పైడి బొమ్మ ..

ఓ చెలి ఈ చెట్టు కొమ్మన నిలుచోమ్మ ..
నీ చెలికాడినయి నీకు నీడగా నిలిచేనమ్మ ..
నా ప్రేమ నీకేనమ్మ ..
ఈ కొయిల నీకు అది వివరించేనమ్మ ..

నా చెలి సోయగం ..
నాకు ఆరాధనా పూర్వం ..
వసంత కాల కోయిల ..
నిన్ను పిలిచే రాలుగాయిలా ..

ఈనాడే వచ్చే ఉగాది ..
నా చెలి రాకతో ..
వసంత కాలం మొదలయింది ..
ఆమని కూతతో ..

బుట్ట బొమ్మలా ఉన్న నీ ముస్తాబు ..
చిట్టి కొయిలమ్మ అదరహో అని కితాబు ..
చెట్టు పుట్ట సైతం నిన్ను చూస్తూ ..
ఉండిపోయాయి మయిమరుస్తూ ..

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam