Cheludu puvvayi cheli chethilo odigina vela

ప్రియా ఈ పువ్వులో పువ్వునై వచ్చానే ..
ముళ్ళు నన్ను బాధిస్తున్నా ..
నీ ప్రేమ పొందుటకు ఇటుల మారానే ..
ఇకనైనా నీ చిరునవ్వుల వరమిస్తావని ఆశిస్తున్నా ..!

రోజా తెచ్చాడు ఈ రాజా ..
నా హృదయ రోజా ప్రేమ కొరకు ..
అది చూసి మయిమరచింది నా రాణి ..
అందున దాగున్నఈ రాజా రూపాన్ని చూసి ..!

పువ్వునై వచ్చానే ..
నీ చేతిలో ఒదిగానే ..
నీ కళ్ళలో మెరుపును చూసానే ..
నా ప్రేమకు అది నీ స్పందనని తలచానే ..!

ఏమి ఈ గులాబి మాయ ..
నాతో ఊసులాడుతుంది ..
నన్ను గిలిగింతపెడుతుంది ..
ఇది గులబినా లేక నా ప్రేమ మాయా!!

చెలి నీవు నేరజానవే ..
నన్నే పువ్వుగా మార్చావే ..
నీ జడలో అమర్చావే ..
నా ప్రేమతో వాడని పువ్వునై అచటనే ఉంటానే ..!

అందమైన నా సఖి కొరకు ..
ఈ అందమైన ప్రేమ కానుక ..
నిన్ను చూడక ఉండలేక ..
పువ్వునై వచ్చా విరహాన్ని తాళ్ళలేక ..!

చిన్నారి పువ్వులో చేలుడిని ..
నీ ప్రేమ వలపుల దాసుడని ..
కొంటె కొనంగికి ఇస్తున్నా ఈ గులాబిని ..
నా ప్రేమ అంగీకారం తెలుపమని ..1

Comments

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam