Cheludu kashtinchi cheli dari chaerae vela --

నీకోసమే నేనున్నా ..
నీకోసమే వస్తున్నా..
ఈ వేడిమిలో నడిచి వస్తున్నా ..
నా చెలి ప్రేమ కోసం ..
అనురాగ బంధం కోసం ..!!

చెలి చూపులు ..
అవి కలువ పూరేకులు ..
ఎంత కష్టాన్నైనా మరపించు మంచు బిందువులు ..
గమ్యాన్ని చేరుకొనుటకు చూపు మార్గదర్శకాలు ..!!

ఇంతటి వేడిమి ..
నిప్పుల కొలమి ..
ఐనా నీ చెలిమి ..
చేసెను నిప్పుని చన్నీటి కొలమి ..!!

ఆకాశపు భగ భగ ..
ఆకలి నక నక ..
కాని చెలి చూపుల నిగ నిగ ..
నన్ను నడిపించెను చక చక ..!!

కొంటె చూపుల వయ్యారి ..
పాల బుగ్గల కావేరి ..
నీకోసమే కదా ఈ పాట్లు ..
ప్రేమ గెలుచుటకు ఈ అగచాట్లు ..!!

కొండలు దాటి ..
గుట్టలు దాటి ..
రేయి పగలు మరచి ..
ఎంత కష్టాన్నైనా ఓర్చి ..
వస్తున్నా నిచ్చెలి ప్రేమ గూర్చి ..!!

సుఖమున నీవు ..
కష్టమున నేను ..
తోడుంటా అనెను ..
నీ దరి చేరుటకు ఇటుల పూనెను ..!!

వినవ రావా నా మాట ..
రావా ఈ చెలికాడి బాట ..
కలసి పయనిద్దాం ..
మన ప్రేమతో ప్రపంచాన్ని జయిద్దాం ..!!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu