Cheli chetilo chikkina chinnodu

ఓ! చెలి ఎటులుంటిని ..
నీకోసమే వచ్చితిని ..
నీ చేతిలో ఓదిగిపోతిని ..
కలకాలం ఇక నీతోనే అంటుంటిని ..!

ఓ! బుల్లోడ నా చెలికాడా ..
నా చేతిలో చిక్కిన వలపుకాడా ..
ఆడిస్తా బొమ్మలా బుడతడా ..
చాలించు నీ టెక్కు చిన్నోడా ..!

వయ్యారి చినదానా ..
సొలపు వలపుల గడుసుదానా ..
నీ మనసు దోచుటకు వచ్చానే ..
నీ చేతిలో ఒదిగానే ..
నీ గుండెలో చేర్చుకోవే ..!

నీ కొరకు నీ చేతి బొమ్మనై రానా ..
నీ మనసునే దోచుకోనా ..
నీకై మిగిలిపోనా ..
నా చెలిని చుస్తూ ఇక ఉండిపోనా ..!

సొగసరి బుల్లి .. నా సిరిమల్లి ..
వన్నెచిన్నెల జాబిల్లి ..
చేయకే లొల్లి .. నా మరుమల్లి ..
ప్రియ నీ చేతిలో పెడతానే చక్కలిగిలి ..!

చిలిపిగా మనసును దోచిన చెలికాడు ..
నా కనుపాపలో మెరిశాడు ..
నా చేతిలో చిక్కాడు ..
ఆడక తప్పదు మరి నీవే నా సరిజోడు ..!

Comments

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu