Cheli palukulu priyuni hrudayamunu taake vela

ఆహా! నా చెలి ఏమి నీ పలుకులు ..
నీ మృదు మధుర సుభాషితములు ..
ప్రేమమైయమై నా గుండెలోకి చేరుతున్నవే ..
నా మనసును వీణ తీగ వలే మీటుతున్నవే ..

తేనెలురే నీ పలుకులు ..
వసంతమున కోయిల గానము వలే సాగుతున్నవే ..
అలల వంటి నీ మాటల ప్రవాహములు ..
నా మనసులోనికి ప్రేమ తరంగములవలె దూసుకుపోతున్నవే ..

చూచితివా నా చెలి పలుకులు ..
ఎంత ప్రేమగా నన్ను పిలుచుచుంటివో ..
గమనించితివా ఆ హావభావములు ..
నా హృదయంత రంగమున చేరుటకు ఎటుల ప్రయత్నించుచున్నదో  ..

చెలి మాటలు చిలక పలుకులు ..
నా హృదయ స్పందనకు ‌‌వేశేను బాటలు ..
నా గుండెను చీల్చి చేరుతున్నవి ఆ ఊసులు ..
నాలో రేపుతున్నవి కొంటె వలపుల తలపులు ..

నా చెలి మాటలు జలపాతముల గలగలలు ..
మీటెనే నా హృదయమున సరిగమలు ..
చిగురించేను నా మనసున ప్రేమ సంగతులు ..
ఆనందమయమై నా మోమున పూచెను చిరునవ్వులు ..

ఏమి నా సఖి హొయలు ..
మరులుగోలిపే ఆ మాటలు ..
ఆ పలుకులు వలపుల తూటాలు ..
నా మనసున దూరి పెట్టెను గిలిగింతలు ..

ఓ! చెలి ఏమి నీ మాటల గలగలలు ..
ఆ ప్రవాహమునకు ఇక లేదా అడ్డుకట్ట ..
నా గుండె అయినదే చీలికలు ..
వేయనా నా ప్రేమతో  ఆనకట్ట ..

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

sneham

Chilipi prasnanaa kavitha

prakruthi andam