Chelini needalaa anusarinchina cheluni hrudaya spandanalu

ప్రియ! నీ తోడుగా రానా ..
నీ నీడనై ఉండనా ..
నీ బాటనే అనుసరించనా ..
నీ గుండె చప్పుడుగా మారిపోనా ..!

నా చెలి చెలికాడను నేను ..
తన తోడు నీడను నేను ..
ఆమె హృదయ స్పందన నేను ..
నా జీవిత ఆశా జ్యోతి తను ..!

సఖి చూపులకై ఈ నిరీక్షణ ..
తన నీడనై సాగిస్తున్నా అన్వేషణ ..
మన్నించి నా వంక చూడవా ..
నా ప్రాణ సఖివై దరి చేరవా ..!

ఓ ప్రియ! ఎటు సాగేను నీ ప్రయాణం ..
ఏటైననూ నీ వైపే నా జీవన యానం ..
నీ నీడనై సాగుతా కలకాలం ..
నా తోడుగా నిలువుము ఎల్లకాలం ..!

చిలిపి నవ్వుల చిన్నారి ..
వలపు చిన్నెల పొన్నారి ..
సోగాసులోలికే వయ్యారి ..
నీ నీడనై వస్తున్నానే సుకుమారి ..!

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Chilipi prasnanaa kavitha

sneham

Padati aabharanamulu